WI Vs IND T20 Series: సిక్సర్ల వీరుడు వచ్చేశాడు..! ఇండియాతో ఐదు టీ20 మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన వెస్టిండీస్..

వెస్టిండీస్ పురుషుల క్రికెట్ జట్టు లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. తదుపరి టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ టీంను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

WI Vs IND T20 Series:  సిక్సర్ల వీరుడు వచ్చేశాడు..! ఇండియాతో ఐదు టీ20 మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన వెస్టిండీస్..

WI Vs IND T20 Series

WI Vs IND T20 Series 2023: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆగస్టు 3 నుంచి జరగనుంది. ఆగస్టు 3న ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (WICB) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వన్డే సిరీస్ కు దూరమైన విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పూరన్ కు చోటు దక్కింది.

India vs West Indies 2nd ODI: డ్రింక్ బాయ్ అవతారమెత్తిన కోహ్లీ.. టీమిండియాకు గట్టి షాకిచ్చిన వెస్టిండీస్

అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బిజీబిజీగా ఉన్న నికోలస్ పూరన్ భారత్ తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ తరపున బ్యాటింగ్ చేసిన నికోలస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ నికోలస్ పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న వూరన్ అజేయ సెంచరీతో 137 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ మంచి ఫామ్‌లో ఉండటంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు టీ20 సిరీస్ కు సెలెక్ట్ చేసింది. మరోవైపు దాదాపు ఏడాది నుంచి వెస్టిండీస్ జట్టుకు దూరంగా ఉన్న షెమ్రాన్ హైట్‌మైర్, వికెట్ కీపర్, బ్యాటర్ షాయ్ హోప్, బౌలర్ థామస్‌కు కూడా సెలెక్టర్లు అవకాశం కల్పించారు. వీరు ముగ్గురు చివరగా గతేడాది న్యూజిలాండ్ పై టీ20ల్లో ఆడారు.

India vs West Indies ODI Series : వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్-కోహ్లీ ఆ పెద్ద మైలురాయిని సాధిస్తారా?

వెస్టిండీస్ పురుషుల క్రికెట్ జట్టు లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. తదుపరి టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ టీంను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2024 జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ ఉత్తమ జట్టును తయారు చేయాలని ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇప్పడి నుంచే ఆ పనిని మొదలు పెట్టాం. ఈ క్రమంలోనే జట్టును అన్ని విధాల బలోపేతం చేసేలా టీమిండియాతో టీ20 సిరీస్ కు జట్టును ఎంపిక చేశామని చెప్పారు.

IND vs WI ODI Match: తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో తెలుసా? సంజు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్.. ..

వెస్టిండీస్ టీ20 జట్టు ఇలా..

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, ఒషానే థామస్, రోమారియో షెఫెర్డ్, ఓడియన్ స్మిత్.

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్ ..

ఆగస్టు 3 (తొలి T20 మ్యాచ్, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్).
ఆగస్టు 6 (రెండో T20 మ్యాచ్, నేషనల్ స్టేడియం, గయానా).
ఆగస్టు 8 (3వ T20 మ్యాచ్. నేషనల్ స్టేడియం గయానా).
ఆగస్టు 12 (4వ T20మ్యాచ్. బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా)
ఆగస్టు 13 (5వ T20మ్యాచ్. బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా)