IND VS WI 3rd ODI: చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..

భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు బ్యాటర్లు 151 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

IND VS WI 3rd ODI: చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..

IND VS WI 3rd ODI

Updated On : August 2, 2023 / 7:47 AM IST

IND VS WI 3rd ODI Match: సిరీస్‌ను దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) జట్టు ప్లేయర్స్ సమిష్టిగా రాణించారు. బ్యాటర్లు చెలరేగిపోయి పరుగుల వరద పారించగా.. బాల్‌తో బౌలర్లు విజృంభించారు. ఫలితంగా 200 పరుగుల భారీ తేడాతో మూడో వన్డేలో వెస్టిండీస్ (West Indies) పై టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని మూడు వన్డేల్లోనూ అర్థ సెంచరీలు (184 పరుగులు) చేసిన ఇషాన్ కిషన్  (Ishan Kishan) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే, వన్డేల్లో వెస్టిండీస్ పై టీమిండియాకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. 2018లో కరీబియన్ జట్టుపై భారత్ 224 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు విండీస్ పై భారత్ వరుసగా 13వ సారి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటి వరకు విండీస్ వన్డే సిరీస్ కైవసం చేసుకోలేదు.

Asian Champions Trophy 2023 : భార‌త్‌లో అడుగుపెట్టిన‌ పాకిస్తాన్ జ‌ట్టు.. ఆగ‌స్టు 9న దాయాదుల స‌మ‌రం

తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. పరుగుల వరద పారించారు. 143 పరుగుల స్కోర్ వద్ద 64 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రితురాజ్ గైక్వాడ్ వెంటనే పెవిలియన్ దారి పట్టాడు. 154 పరుగుల వద్ద కేవలం 8పరుగులు చేసిన గైక్వాడ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి శుభ‌మన్ గిల్ దూకుడుగా ఆడారు. 223 పరుగుల వద్ద సంజూ శాంసన్ (51) ఔట్ అయ్యాడు. రోమారియో షెపర్డ్ వేసిన బంతికి సంజు క్యాచ్ ఔట్ అయ్యాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న గిల్ 92 బంతుల్లో 85 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 244 పరుగులు.

IND VS WI ODI series

IND VS WI ODI series

గిల్ ఔట్ తరువాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడారు. అయితే, 309 స్కోర్ వద్ద 30 బంతుల్లో 35 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు. చివరిలో జడేజాతో కలిసి హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. దీంతో పాండ్యా 52 బంతుల్లోనే 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జడేజా ఎనిమిది పరుగులు చేశాడు. బ్యాటర్లు విజృంభించడంతో టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులకు చేరింది. అయితే, వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో 2, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, కారియా తలో వికెట్‌ పడగొట్టారు.

Virat Kohli : కోహ్లి ఏ ఇయ‌ర్ బ‌డ్స్ వాడుతాడో తెలుసా..? మ‌న ద‌గ్గ‌ర దొర‌క‌వు.. ధ‌ర ఎంతంటే..?

భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. తొలి ఓవర్లో ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన బౌలింగ్ లో బ్రెండన్ కింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తరువాత ముకేశ్ వేసిన ఓవర్లో కైల్ మేయర్స్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే షై హోప్ (5) కూడా ముకేశ్ బౌలింగ్ ఔట్ అయ్యాడు. వరుసగా మూడు వికెట్లు ముకేశ్ ఖాతాలో పడ్డాయి. వెస్టిండీస్ 35 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో కిసీ కార్టీ (6) ఔట్ అయ్యాడు.ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హెట్ మయర్ (4) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రోమారియో షెపర్డ్ (8) ను శార్దూల్ ఔట్ చేశాడు. దీంతో విండీస్ జట్టు 50 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది.

Shubman Gill and Hardik Pandya

Shubman Gill and Hardik Pandya

చివరికి 35.3 ఓవర్లలో 151 పరుగులకే వెస్టిండీస్ జట్టు ఆలౌట్ అయింది. విండీస్ జట్టులో గుడాకేస్ మోటీ (39 నాటౌట్), అథనేజ్ (32), అల్జారీ జోసెఫ్ (26), కరియా (19) మాత్రమే రెండకెల స్కోర్ చేశారు. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్‌ (3/30), కుల్‌దీప్‌ యాదవ్ (2/25) వికెట్లు పడగొట్టారు. ఆగస్టు 3 నుంచి ఇండియా వర్సెస్ విండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.