Abhishek Sharma : నేను 90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా.. సూర్యకుమార్ నా వద్దకు వచ్చి.. : అభిషేక్ శర్మ
కెప్టెన్, కోచ్ మద్దతు తనకు ఎల్లప్పుడూ ఉందని అభిషేక్ తెలిపాడు.

when I was in my 90s Suryakumar Yadav come to me and told Abhishek Sharma comments viral
ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేశాడు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ కాకుండా శివమ్ దూబె (13 బంతుల్లో 30 పరుగులు), తిలక్ వర్మ (15 బంతుల్లో 24)లు వేగంగా ఆడారు. సంజూ శాంసన్ (16) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2), హార్దిక్ పాండ్యా(9), రింకూ సింక్ (9)లు విపలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు, మార్క్ వుడ్ రెండు, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జేమి ఓవర్టన్‌లు తలా ఓ వికెట్ తీశారు.
IND vs ENG : ముకేశ్ అంబానీనే నిలబెట్టిన అభిషేక్ శర్మ.. ఓర్నీ చిచ్చర పిడుగా.. వీడియో వైరల్
అనంతరం భారత్ బౌలర్లు రాణించడంతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (23 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఫిలిప్ కాకుండా జాకబ్ బెథెల్ (10) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
Abhishek Sharma said, “when I was in my 90s and a few wickets were falling, Suryakumar Yadav told me ‘you can take 2-3 balls here’. The captain and coach always backed me”. pic.twitter.com/q3yIZgnWkU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2025
ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. తన మెంటార్ యువరాజ్ సింగ్‌తో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. తనదైన తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడతానని చెప్పాడు. ఎవరికైనా కెప్టెన్, కోచ్ మద్దతు కీలకం అని అన్నాడు. ఆ విషయంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చాడు. బంతికి తగినట్లుగా స్పందించి షాట్లను ఆడానన్నాడు.
ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ (ఆర్చర్ బౌలింగ్‌లో షాట్ పై) బౌలింగ్‌లో బంతిని కవర్ మీదుగా ఆడడం అంత తేలిక కాదని చెప్పుకొచ్చాడు. స్ట్రైయిట్ డ్రైవ్‌తో సిక్స్ కొట్టడం యువీ వల్లే సాధ్యమైందన్నాడు. ‘నా ఆట చూసి యువీ సంతోషించి ఉంటాడు. యువీతో పాటు గంభీర్ సైతం నేను కనీసం 15 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని కోరుకుంటారు. ఈ మ్యాచ్‌లో దాన్ని నేను సాధించా.’ అని అభిషేక్ అన్నాడు.
ఇక సెంచరీ ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఏం చెప్పాడు అన్న విషయాన్ని వెల్లడించాడు. ’90 పరుగుల వద్ద నేను బ్యాటింగ్ చేస్తుండగా రెండు మూడు వికెట్లు పడ్డాయి. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ నా వద్దకు వచ్చి రెండు మూడు బంతులు తీసుకున్నా ఫర్వాలేదు సెంచరీ చేయ్.’ అని భరోసా ఇచ్చాడు అని అభిషేక్ శర్మ చెప్పాడు. కెప్టెన్, కోచ్ మద్దతు తనకు ఎల్లప్పుడూ ఉందని అభిషేక్ తెలిపాడు.