India Bangladesh Series: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు నిరాశ..! మరికొన్నాళ్లు ఆగాల్సిందే.. భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా..
ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్లను గ్రౌండ్ లో చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, వారు గ్రౌండ్ లోకి రావడం..

India Bangladesh Series: బంగ్లాదేశ్, భారత్ మధ్య ఆగస్టులో జరగాల్సిన వైట్-బాల్ సిరీస్ వాయిదా పడింది. సిరీస్ ను వాయిదా వేయడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) శనివారం పరస్పరం అంగీకరించాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ ఆగస్టులో జరగాల్సి ఉంది. కాగా, వచ్చే ఏడాది సెప్టెంబర్ కు వాయిదా వేశారు.
బంగ్లాదేశ్ టూర్ లో భారత్ 3 వన్డే మ్యాచ్ లు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుండి 31 వరకు చిట్టగాంగ్, ఢాకాలో ఈ సిరీస్ లు జరగాల్సి ఉంది. అయితే సిరీస్ ను వాయిదా వేస్తూ ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కమిట్ మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, రెండు బోర్డుల మధ్య చర్చల అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తెలిపింది.
పర్యటనకు సంబంధించి సవరించిన తేదీలు, మ్యాచ్‌లను త్వరలోనే ప్రకటిస్తామంది. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగా ఈ సిరీస్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సిరీస్ ను ఇరు జట్ల బోర్డులు వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించాయి. ఈ సిరీస్ కొత్త షెడ్యూల్‌ను “తగిన సమయంలో” ప్రకటిస్తామని BCB తెలిపింది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ కోసం సెప్టెంబర్ 2026లో భారత్ ను స్వాగతించడానికి BCB ఎదురుచూస్తోంది.
Also Read: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అత్యంత వేగవంతమైన 100.. జస్ట్..
భారత్, బంగ్లా సిరీస్ వాయిదా పడటంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కొంత అప్ సెట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్లను గ్రౌండ్ లో చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, వారు గ్రౌండ్ లోకి రావడం మరింత ఆలస్యం కానుంది. ఫ్యాన్స్ కి ఎదురుచూపులు తప్పడం లేదు. కోహ్లి, శర్మల కమ్ బ్యాక్ మరింత ఆలస్యం కానుందనే వార్త తెలిసి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ దిగ్గజ బ్యాటర్లు ఇద్దరూ ఒకేసారి టీ20లకు, టెస్టులకు రిటైర్ మెంట్ ప్రకటించేశారు. దీంతో వీరిద్దరినీ ఎప్పుడెప్పుడు వన్డేల్లో చూస్తామా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో వారు కొంత నిరాశ చెందారు.