Ayesha Naseem : అయేషా నసీమ్ ఎవరు..? 18 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించింది..?
సాధారణంగా ఆటగాళ్లు 35 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆడుతూనే ఉంటారు. అప్పడు కూడా శరీరం సహకరించడంతో పాటు ఫామ్‌లో ఉంటే మరికొన్నాళ్లు ఆడుతారు. గాయాలు కావడం, ఏదైన అనుకోని కారణాలు ఉంటే తప్ప తమ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించరు.

Ayesha Naseem
Ayesha Naseem Retirement : సాధారణంగా ఆటగాళ్లు 35 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆడుతూనే ఉంటారు. అప్పడు కూడా శరీరం సహకరించడంతో పాటు ఫామ్‌లో ఉంటే మరికొన్నాళ్లు ఆడుతారు. గాయాలు కావడం, ఏదైన అనుకోని కారణాలు ఉంటే తప్ప తమ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించరు. అయితే.. పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పింది. ఆమె మరెవరో కాదు అయేషా నసీమ్(Ayesha Naseem).
ఇస్లాం మతంకు అనుగుణంగా పవిత్రమైన జీవితాన్ని గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయేషా నసీమ్ చెప్పింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board)కు తెలియజేసింది. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
Shah Rukh Khan : కింగ్ ఖాన్ చేతిలో వన్డే ప్రపంచకప్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
🚨BREAKING NEWS!!🚨
Pakistan’s young cricket star, 18 Year Old Ayesha Naseem quits cricket.
She played 4 ODIs and 30 T20Is for Pakistan. She was one of the best hitters from Pakistan women’s team.#CricketTwitter pic.twitter.com/0gHDGgSL7V
— Female Cricket (@imfemalecricket) July 20, 2023
అయేషా నసీమ్ 2004 ఆగస్టు 7 జన్మించింది. 15 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసింది. 3 మార్చి 2020లో థాయ్‌లాండ్‌పై టీ20మ్యాచ్‌లో తొలిసారి పాక్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ తరుపున 30 టీ20లు, 4 వన్డేలు ఆడింది. వన్డేల్లో 33 పరుగులు, టీ20ల్లో 369 పరుగులు చేసింది. హార్ట్ హిట్టగా పేరుగాంచిన నసీమ్ గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై 45 పరుగులతో రాణించింది. ఆ మ్యాచ్‌లో పాక్ జట్టులో ఆమె టాప్ స్కోరర్ కావడం గమనార్హం. అంతేకాదండోయ్..ఇదే ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోరు కావడం గమనార్హం. నసీమ్ తన చివరి మ్యాచ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో ఆడింది.
భవిష్యత్‌లో స్టార్ బ్యాటర్‌గా రాణిస్తుందనుకున్న తరుణంలో నసీమ్ ఆటకు వీడ్కోలు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు పాకిస్థాన్ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Ayesha Naseem is some hitter and she’s only 18 😔pic.twitter.com/Wx41vrguXw
— Farid Khan (@_FaridKhan) July 20, 2023