WPL Auction 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. కోటి దాటే ఆటగాళ్లు వీళ్లేనా?

ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర పలకొచ్చని అంచనా.

WPL Auction 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. కోటి దాటే ఆటగాళ్లు వీళ్లేనా?

Updated On : February 13, 2023 / 10:24 AM IST

WPL Auction 2023: త్వరలో ప్రారంభం కానున్న మహిళా ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్)కు సంబంధించి సోమవారం నుంచి ఆటగాళ్ల వేలం ప్రారంభంకానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

అవి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్. ఈ ఐదు జట్లకు కలిపి 90 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈ వేలం కోసం 409 ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ప్రతి జట్టు గరిష్టంగా రూ.12 కోట్లు చెల్లించి, మొత్తం 18 మంది ప్లేయర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. వీరిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఐదు జట్లలో కలిపి 60 మంది భారత ఆటగాళ్లు, 30 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. దీంతో ఇండియాకు సంబంధించి 60 మంది ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. అందులో 20-25 మంది వరకు వేలంలో మంచి ధర దక్కుతుందని అంచనా.

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. సోమవారం బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ

ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర పలకొచ్చని అంచనా. ఇండియన్ స్టార్ ప్లేయర్స్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్మ, స్మృతి మంధాన, దీప్తి శర్మకు రూ.కోటి పైగానే ధర పలకవచ్చని అంచనా. వీరిలో కొందరు రూ.1.25-2 కోట్ల వరకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

వీరితోపాటు రిచా ఘోష్, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, మేఘనా సింఘ్, శిఖా పాండే కూడా భారీ పలికే అవకాశం ఉంది. డబ్ల్యూపీఎల్ వల్ల భారత మహిళా క్రికెట్ ప్లేయర్స్‌కు మంచి అవకాశాలు దక్కొచ్చు.