WTC Final 2025 : టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంతోషంగా ఉందన్న కమిన్స్..
లండన్‌లోని ప్రఖాత్య లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.

WTC Final 2025 South Africa win the toss and elected bowl first
లండన్‌లోని ప్రఖాత్య లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ ఓడిపోయినప్పటికి, తొలుత బ్యాటింగ్ చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.
‘మేము ఫీల్డింగ్ చేయాలని అనుకుంటున్నాము. ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. మేము అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాము. మా 15 మంది కూడా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఇదొక గొప్ప ఫైనల్.’ అని బవుమా అన్నాడు.
‘ముందుగా బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికి కూడా వికెట్ చూడడానికి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది. టైటిల్ సొంతం చేసుకోవాలని గత కొన్నాళ్లుగా 15 మంది ఆటగాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. మాకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం అయ్యేందుకు 10 రోజుల సమయం దొరకింది. మేము సిద్ధంగా ఉన్నాము. మా పై ఒత్తిడి ఏం లేదు. గతంలో కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాము, గెలిచాము. ఈ సారి కూడా అలాగే జరుగుతుంది.’ అని కమిన్స్ అన్నాడు.
దక్షిణాఫ్రికా తుది జట్టు..
ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి
WTC : డబ్ల్యూటీసీ విజేతకు గదను ఎందుకు ఇస్తారో తెలుసా? గద వెనుక ఉన్న స్టోరీ ఇదే..
ఆస్ట్రేలియా తుది జట్టు..
ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.