Yashasvi Jaiswal : శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. సెహ్వాగ్, మంజ్రేకర్ రికార్డు సమం
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు.

Yashasvi Jaiswal
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. విశాఖలో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది మూడో సెంచరీ.
సెహ్వాగ్, మంజ్రేకర్ రికార్డు సమం..
జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. టీమ్ఇండియా తరుపున టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్‌ల రికార్డులను సమం చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్ లు 13 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు చేశారు. జైస్వాల్ కూడా 13 ఇన్నింగ్స్‌ల్లో నే మూడు సెంచరీలు బాదాడు. ఆ సమయంలో సెహ్వాగ్ సగటు 53.31 కాగా, యశస్వి సగటు 62.25 గా ఉండడం గమనార్హం.
Badminton Asia Team Championships : చరిత్ర సృష్టించిన భారత మహిళా షట్లర్లు
A leap of joy to celebrate his second century of the series ?
Well played, Yashasvi Jaiswal ??#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/pdlPhn5e3N
— BCCI (@BCCI) February 17, 2024
ఇక.. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (19) జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే.. వన్ డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి కుదురుకున్నాక తన దైన శైలిలో బ్యాట్‌ను ఝళిపించాడు. 79 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
Jonny Bairstow : ఏంటయ్యా ఇదీ.. భారత్ అంటే అంత భయపడిపోతున్నావ్ ఎందుకు? ఇలా అయితే కెరీర్ ఖతం
హాఫ్ సెంచరీ తరువాత జైస్వాల్ వేగం పెంచాడు. ముఖ్యంగా స్పిన్నర్ల ను ఓ ఆట ఆడుకున్నాడు. స్వీప్, రివర్స్ స్వీప్, టైమింగ్ షాట్లతో యడాపెడా బౌండరీలు బాదాడు. 122 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. జేమ్స్ అండర్సన్ వేసిన ఓ ఓవర్‌లో అయితే వరుసగా 6,4,4 బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి.
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా స్కోరు 40 ఓవర్లలో 168/1. జైస్వాల్ (100), గిల్ (44)లతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్ 294 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.