Mohammed Malik: టీమిండియాలో హైదరాబాద్ కుర్రోడికి చోటు.. ఎవరీ మాలిక్..

ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో తన టాలెంట్ చూపించాడు. ఈ టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

Mohammed Malik: టీమిండియాలో హైదరాబాద్ కుర్రోడికి చోటు.. ఎవరీ మాలిక్..

Updated On : November 13, 2025 / 12:27 AM IST

Mohammed Malik: హైదరాబాద్ కుర్రాడు దుమ్ము రేపాడు. ఏకంగా భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. టీమిండియా అండర్ 19లో మహమ్మద్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు. మాలిక్ కు అండర్ 19-A టీంలో అవకాశం కల్పించింది బీసీసీఐ. ఫాస్ట్ బౌలర్ గా మహమ్మద్ మాలిక్ రాణిస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ నెల 17న బెంగుళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న సిరీస్ లో మాలిక్ ఆడనున్నాడు. భవిష్యత్తులో ఇండియన్ టీమ్ కు ఆడటమే తన డ్రీమ్ అని మాలిక్ తెలిపాడు.

నాంపల్లిలోని మల్లెపల్లికి చెందిన యువ క్రికెటర్ మహ్మద్ మాలిక్ ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో తన టాలెంట్ చూపించాడు. ఈ టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

స్కూల్ స్టేజ్ నుంచే క్రికెట్‌లో సత్తా చాటుతున్న మాలిక్‌కు 2022లో హైదరాబాద్ అండర్-16 జట్టులో చోటు దక్కింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రాణించాడు. ఓ ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతడికి గుర్తింపు వచ్చింది. మాలిక్ హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. టీమిండియాకు ఆడాలన్నదే తన డ్రీమ్ అని మాలిక్ చెప్పాడు. అండర్ 19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయన్నాడు.