IPL 2019: యువీ ముంబై ఇండియన్స్ జెర్సీపై ట్వీట్ల వర్షం

కొన్నేళ్లుగా యువరాజ్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఐపీఎల్ లోని ఏ ఫ్రాంచైజీ అంతగా ఆసక్తి కనబరచడం లేదు. వేలం చివర్లో కొనుగోలు చేయడం యువీ దక్కాడనిపించుకుంటున్నాయి. ఫామ్ లో లేడని అవకాశమివ్వకుండానే మ్యాచ్ లో ఆడేందుకు కూడా అవకాశాలివ్వకపోవడంతో ఆడిన ఒకట్రెండు మ్యాచ్ లలో సత్తా చూపించలేక యువీ అలాగే ఉండిపోతున్నాడు.
అయినప్పటికీ అభిమానుల్లో అతనిపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2018 ఐపీఎల్ సీజన్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడిన యువరాజ్ సింగ్‌ను 2019 వేలానికి విడిచిపెట్టేసింది ఆ యాజమాన్యం. ఇప్పుడు 2019 సీజన్ వేలం ఆఖరి రౌండ్‌లో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ నుంచి జెర్సీ మార్చుకుని బరిలోకి దిగుతున్న యువరాజ్ సింగ్ జెర్సీని తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అంతే క్షణాల్లో ఆ ట్వీట్‌కు స్పందన మొదలైంది. ‘ఎట్టకేలకు తన ఫేవరేట్ నెం.12 జెర్సీతో యువరాజ్ బరిలోకి దిగుతున్నాడు. మళ్లీ యువరాజ్ బ్లూలో కనిపిస్తుంటే టీమిండియాకు ఆడుతున్నట్లు కనిపిస్తుంది’ అంటూ ట్విట్టర్ వేదికగా మోసేస్తున్నారు. ఐపీఎల్ 2019 వేలంలో ముంబై ఇండియన్స్.. యువరాజ్ సింగ్‌తో పాటు లసిత్ మలింగ, పంకజ్ జైస్వాల్, రసిఖ్ దార్, అన్మోల్‌ప్రీత్ సింగ్, బరీందర్ శ్రాన్ లను కొనుగోలు చేసింది.
It’s official! Your favourite number 12 is back in BLUE ?#CricketMeriJaan @YUVSTRONG12 pic.twitter.com/WebR8zoc2B
— Mumbai Indians (@mipaltan) March 5, 2019