Yuvraj Singh క్షమించమని అడుగు

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చిక్కొచ్చిపడింది. లైవ్ లో యుజ్వేంద్ర చాహల్ పై పరుషంగా మాట్లాడటమే దీనికి కారణం. ఏప్రిల్ నెలలో యువీ.. రోహిత్ లు ఇన్ స్టా లైవ్ లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఫన్నీ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ టాపిక్ వచ్చింది.
చాహల్ టిక్ టాక్ వీడియోల గురించి మాట్లాడుతూ.. ‘వీడికి ఇక పనేం లేదా.. యుజీ, కుల్దీప్‌లకు’ అని యువీ ప్రశ్నించాడు. ‘యుజీ చూశావా కుటుంబంతో సహా వీడియో పెట్టాడు. నేను అప్పుడే చెప్పా. మీ నాన్న డ్యాన్స్ చేయిస్తున్నావ్. నీకు పిచ్చిగానీ పట్టిందా అని రోహిత్ అడిగాడు.
లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ లో సూపర్ యాక్టివ్ గా ఉన్న చాహల్.. కుటుంబ సభ్యులతోనూ కలిసి వీడియోలు చేసి పోస్టు చేసి పెట్టాడు. దానిపై రెగ్యూలర్ క్రికెటర్లతో పాటు ఇండియా టీమ్ మేట్స్ కూడా ఫన్నీ కామెంట్లు పెట్టారు. రీసెంట్ గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చాహల్ ను ట్రోల్ చేశాడు.
We Respect you @YUVSTRONG12 and everyday as a good human as a great cricketer but what you have said is really not acceptable.
It’s time for you to walk outside and apologize for this mistake.#युवराज_सिंह_माफी_मांगो pic.twitter.com/XsCv1MxOkD— Ayushi Ambedkar (@ayushi_ambedkar) June 1, 2020
‘ఎవరు నీ హెయిర్ కట్ చేసిందని కోహ్లీ అడిగితే దానికి చాహల్ బదులిచ్చాడు. భయ్యా మా అక్క కట్ చేసింది. నేను కూడా వాళ్లది కట్ చేశా’ అని అన్నాడు. అప్పుడు కోహ్లీ .. ఓహో నేనింకా కుక్కలు నీ వెంట పడ్డాయేమో అనుకున్నా అన్నాడు. ఆ మాటకు లైవ్ సెషన్ లో ఉన్న వారు చాట్ రూమ్ లో వ్యక్తులంతా పగలబడి నవ్వారు.
people are fire on yuvraj singh for his comment on UC
Meanwhile uc#युवराज_सिंह_माफी_मांगो pic.twitter.com/KLp6PXf6w2— Mahesh Padalkar (@MaheshPadalkar2) June 1, 2020