Aadhar Card Rules : బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచే ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఆధార్ అప్‌డేట్ ఫీజు ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!

Aadhar Card Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ సంబంధించి కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆధార్ అప్‌డేట్ ఫీజు ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

Aadhar Card Rules : బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచే ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఆధార్ అప్‌డేట్ ఫీజు ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!

Aadhar Card Rules

Updated On : October 29, 2025 / 4:43 PM IST

Aadhar Card Rules : ఆధార్ కార్డు కొత్త రూల్స్ రాబోతున్నాయి. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి అనేక మార్పులు రానున్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుదారులు తమ వ్యక్తిగత వివరాలను ఎలా అప్‌డేట్ చేసుకోవాలి అనేదానిపై కొత్త సవరణను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త మార్పులతో వినియోగదారులు తమ ఇంటి నుంచే పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌తో సహా కీలకమైన వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఈ డిజిటల్-ఫస్ట్ పాలసీతో ఆధార్ అప్‌డేట్ కోసం (Aadhar Card Rules) ప్రతిసారి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మరోవైపు.. పౌరసత్వ రుజువుగా లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్‌గా ఆధార్ కార్డు వినియోగించలేమని యూఐడీఏఐ మరోసారి స్పష్టం చేసింది. ఇందులో 12 అంకెల ఆధార్ నంబర్ ఐడెంటిటీ ప్రూఫ్‌గా మాత్రమే పనిచేస్తుంది.

ఆధార్ కార్డు కొత్త రూల్స్ :
యూఐడీఏఐ కొత్త వెరిఫికేషన్ సిస్టమ్ ఇప్పుడు యూజర్ డేటాను పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రాల రికార్డులతో సహా ఇతర అధికారిక ప్రభుత్వ డేటాబేస్‌లతో క్రాస్-చెక్ చేసుకోవచ్చు. తద్వారా ఆటోమాటిక్‌గా ధృవీకరిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వెరిఫికేషన్ మోడల్ మాన్యువల్ అవసరం లేదు. అదనంగా, యూఐడీఏఐ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో చేసే అప్‌డేట్స్ కోసం రుసుము కూడా సవరించింది.

Read Also : Reliance Jio : పండగ చేస్కోండి.. జియో స్పెషల్ ప్లాన్ కేక.. జస్ట్ రూ. 299కే 35GB డేటా.. ఫ్రీగా JioFI డివైజ్ కూడా..!

ఆధార్ హోల్డర్లు ఇప్పుడు తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు ఎంచుకోవచ్చు. లేదంటే.. మీ సమీపంలోని ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లొచ్చు. డిసెంబర్ 31, 2025 నాటికి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి. జనవరి 1, 2026 నుంచి లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అవుతాయి.

కొత్త దరఖాస్తుదారులకు, ఆధార్ అథెంటికేషన్ ఇప్పుడు పాన్ జారీ ప్రక్రియలో తప్పనిసరిగా మారింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కోసం కేవైసీ ప్రక్రియ, పేపర్ లెస్ ఆన్‌బోర్డింగ్ కోసం ఆధార్ ఆధారిత OTP, వీడియో కేవైసీ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా పూర్తి చేయొచ్చు.

ఆధార్ అప్‌డేట్ ఫీజు ఎంతంటే? :

కొత్తగా సవరించిన రుసుము ప్రకారం.. ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్, ఇమెయిల్ వంటి వివరాలను అప్‌డేట్ చేసేందుకు రూ. 75 ఖర్చవుతుంది. అదనంగా, ఫింగర్ ఫ్రింట్, ఐరిస్, ఫొటో అప్‌డేట్స్ వంటి బయోమెట్రిక్ కోసం రూ. 125 ఖర్చవుతుంది. అయితే, డాక్యుమెంట్ అప్‌డేట్స్ కోసం ఆధార్ రీప్రీటింగ్ రుసుము చెల్లించాలి. వినియోగదారులు ఆధార్ సెంటర్లలో వరుసగా రూ. 75, రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా, 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వయస్సు గల పిల్లలకు, 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్స్ ఉచితం. ఇంకా, ఇంట్లో నుంచి సర్వీసు పొందే మొదటి వ్యక్తికి రూ. 700, ప్రతి అదనపు సభ్యునికి రూ. 350 చెల్లించాల్సి ఉంటుంది.