Internet Speed Record : జపాన్ న్యూ ఇంటర్నెట్ స్పీడ్ రికార్డు.. 57వేల ఫుల్ మూవీలను సెకన్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు!

జపాన్ ఇంటర్నెట్ స్పీడ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో క్షణాల వ్యవధిలో డేటాను విజయవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఒక సెకనకు 319 టెరాబైట్ల (TB)ల స్పీడ్ ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయగలిగింది.

Internet Speed Record : జపాన్ న్యూ ఇంటర్నెట్ స్పీడ్ రికార్డు.. 57వేల ఫుల్ మూవీలను సెకన్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు!

At 319 Tbps, Japanese Team Bolts To New Internet Speed Record

Updated On : July 16, 2021 / 12:29 PM IST

New Internet Speed Record : జపాన్ ఇంటర్నెట్ స్పీడ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో క్షణాల వ్యవధిలో డేటాను విజయవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. జపాన్ కు చెందిన రీసెర్చర్ల బృందం డిజిటల్ హైవేపై ఉస్సేన్ బోల్ట్ (Usain Bolt) అంత వేగంతో ఇంటర్నెట్ స్పీడ్‌ రికార్డును నెలకొల్పింది. ఒక సెకనకు 319 టెరాబైట్ల (TBps)ల స్పీడ్ ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయడంలో విజయం సాధించారు. ఈ ఒక బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌తో 57వేల ఫుల్ లెన్త్ మూవీలను ఒక సెకనులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Spotify లైబ్రరీ మొత్తాన్ని కేవలం 3 సెకన్లలోపే డౌన్ లోడ్ చేసేయొచ్చు. అంటే.. సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో నడుస్తుంది. అదే మనదేశంలో ఎక్కువ మంది బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను కేవలం 512kbps వద్ద మాత్రమే పొందుతారు. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (NIICT) పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించింది. ఈ ఇంటర్నెట్ రికార్డు వేగాన్ని సాధించడానికి ప్రస్తుత ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలను (optical fibre infrastructure) ఉపయోగించారు.

ఇందుకోసం 3,0001 కిలోమీటర్లకు పైగా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్సామిషన్ ను సెట్ చేసింది. భారతీయ బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనిటీ (Indian broadband community) సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హై-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ (high-speed transmission) ద్వారా ఇండియాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధికంగా డేటా స్పీడ్ అందించడానికి ప్రస్తుత భారతీయ ప్రసార వ్యవస్థల్లో సామర్థ్యం లేదని బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం అధ్యక్షుడు టీవీ రామచంద్రన్ అన్నారు. ప్రస్తుతానికి మన దగ్గర 500 మిలియన్ లేదా అంతకంటే తక్కువ మంది వినియోగదారులు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత ట్రాన్స్ మిషన్ సిస్టమ్‌లను పరిశీలిస్తే.. ప్రస్తుత వ్యవస్థలు అధిక సామర్థ్యం గల డేటా సామర్థ్యం లేనందున సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇదోక లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌గా Hughes Network Systems India Ltd ప్రెసిడెంట్ ప్రణావ్ రోచ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ఇండియాలో అమలు చేయాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు.