BSNL Prepaid Plan : BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ.199 ప్లాన్‌తో బోలెడు బెనిఫిట్స్.. డేటా లిమిట్, వ్యాలిడిటీ ఎంతంటే?

BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ రూ. 199 ప్లాన్ కొనుగోలుపై బెనిఫిట్స్, డేటా లిమిట్, వ్యాలిడిటీ వివరాలివే..

BSNL Prepaid Plan : BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ.199 ప్లాన్‌తో బోలెడు బెనిఫిట్స్.. డేటా లిమిట్, వ్యాలిడిటీ ఎంతంటే?

BSNL Recharge Plan

Updated On : September 18, 2025 / 4:04 PM IST

BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వచ్చేసింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని (BSNL Prepaid Plan) టెలికాం సర్వీస్ ఇటీవల అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా లిమిట్, ఇతర బెనిఫిట్స్ సహా రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది.

అదనంగా, టెల్కో రూ.107 నుంచి ప్రారంభమయ్యే అనేక బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. మీరు స్టూడెంట్ లేదా సెకండరీ సిమ్ కలిగిన యూజర్ అయితే బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ కొనుగోలుపై హై-స్పీడ్ డేటా, ఫ్రీ వాయిస్ కాలింగ్, రోజువారీ SMS వంటి ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2GB హై-స్పీడ్ డేటా/లిమిట్, 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100SMSలతో వస్తుంది. అదనంగా, టెలికాం ఆపరేటర్ రీఛార్జ్‌పై 2శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు BSNL వెబ్‌సైట్, సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు. డేటా క్యాప్ తర్వాత స్పీడ్ 40kbpsకి పడిపోతుంది.

Read Also : PM Kisan 21st Installment Date : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత దీపావళికి ముందే వస్తుందా? రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం కేవలం రూ.107కే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 3GB హై-స్పీడ్ డేటా, 200 ఫ్రీ వాయిస్ నిమిషాలు (లోకల్, STD, రోమింగ్) ఉన్నాయి. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 40kbpsకి తగ్గుతుంది. ఆ తర్వాత స్టాండర్డ్ కాల్/SMS ఛార్జీలు నిమిషానికి లోకల్‌కు రూ.1, STD/నిమిషానికి రూ.1.30, రూ.0.80/SMS చొప్పున వర్తిస్తాయి.

అదనంగా, 30 రోజుల పాటు రోజుకు 1.5GB, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 200 SMS అందించే రూ. 141 ప్యాక్ కూడా పొందవచ్చు. రోజువారీ లిమిట్ తర్వాత డేటా, SMS అందుబాటులో ఉండదు. ఇంకా, రూ. 147 ప్లాన్ వన్-టైమ్ 10GB హై-స్పీడ్ డేటా లిమిట్ 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (రోమింగ్‌తో సహా) అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ 28 రోజుల పాటు రోజుకు 1GB డేటా, అన్‌‌లిమిటెడ్ వాయిస్ డేటా, రోజుకు 100 SMSలతో రూ. 149 ప్లాన్‌ కూడా పొందవచ్చు.