BSNL Offers : BSNL బంపర్ ఆఫర్.. కొత్త చీపెస్ట్ ప్లాన్ అదిరింది.. ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్, 210GB వరకు హైస్పీడ్ డేటా..!
BSNL Offers : కొత్త బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ అదిరింది.. సరసమైన ధరలో బీఎస్ఎన్ఎల్ రోజుకు 70GB హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఫ్రీ కాల్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.

BSNL's new affordable plan
BSNL Offers : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. వినియోగదారుల కోసం అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఒకవైపు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ బేస్ పెంచుకుంటూ పోతోంది.
Read Also : iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ భయ్యా.. ఇలా చేస్తే.. తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీ సొంతం..!
ఇటీవలి నెలల్లో అత్యధిక సంఖ్యలో కొత్త వినియోగదారులు పెరిగారు. సరసమైన ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అదే సమయంలో, బీఎస్ఎన్ఎల్ అదనపు కస్టమర్లను ఆకర్షించడానికి నెట్‌వర్క్, రీఛార్జ్ ఆఫర్‌లను మెరుగుపరుస్తోంది. ఇతర టెలికం సంస్థలు తమ మార్కెట్ ఉనికిని ప్రభావితం చేసే కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతూ బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీని ఇస్తోంది.
టెలికాం రంగంలో BSNL సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లకు బెస్ట్ నెట్‌వర్క్. పోటీ ధరలకు లాంగ్ టైమ్ వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ఇటీవలి బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లు ప్రైవేట్ కంపెనీలకు మరింత పోటీని పెంచాయి.
బడ్జెట్-ఫ్రెండ్లీ డేటా ప్లాన్‌లను కోరుకునే వినియోగదారులు BSNL ఆఫర్లను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో అనేక రకాల ప్లాన్‌లను అందిస్తుంది. ఈ టెలికం కంపెనీ 70, 45, 150, 160, 180, 336, 365, 425 రోజుల ప్లాన్‌లతో మిలియన్ల మంది మొబైల్ యూజర్లకు సర్వీసులను అందిస్తోంది. లేటెస్ట్ ప్లాన్‌లో తక్కువ ధరకే హై-స్పీడ్ డేటా అందిస్తుంది.
Enjoy 70 GB Data, Unlimited Calls, and 100 SMS/Day, all in one affordable plan.
Stay connected without worry!Get more for less with BSNL Postpaid Plan 399.#BSNLPostpaid #BSNLIndia #ConnectingWithCare #AffordablePlan #StayConnected pic.twitter.com/BsrJIK62HD
— BSNL India (@BSNLCorporate) April 8, 2025
BSNL రూ.399 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ లైనప్‌లో ఇటీవలే రూ. 399 రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్లాన్ ప్రతి నెలా 70GB డేటాను అందిస్తుంది. 210GB వరకు డేటా రోల్‌ఓవర్ ఆప్షన్ ఉంది. ఈ ఆఫర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఫ్రీ కాలింగ్, అడ్వాన్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. సుమారు రూ. 13 రోజువారీ ఖర్చుతో BSNL ప్లాన్ రోల్‌ఓవర్ బెనిఫిట్స్‌తో 70GB డేటాను అందిస్తుంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ సంస్థ బీఎస్ఎన్ఎల్ 5G టెక్నాలజీ కోసం టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) రూ. 61వేల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ నిధులతో BSNL త్వరలో 5G సర్వీసులను ప్రారంభించనుంది.
ఈ కేటాయింపుతో బీఎస్ఎన్ఎల్ అవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీలకు యాక్సస్ కలిగి ఉంటుంది. అందులో హై-స్పీడ్ ఇంటర్నెట్, 5G నెట్‌వర్క్ మెరుగైన కనెక్టివిటీని అందించే కీలకమైన స్పెషల్ బ్యాండ్‌లను కలిగి ఉంటుంది.