Twitch, Youtubeకు పోటీగా : ఫేస్‌బుక్ నుంచి కొత్త గేమింగ్ యాప్ వచ్చేసింది
కొవిడ్-19 వ్యాప్తితో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇంట్లోనే ఉంటూ ఎంటర్ టైన్మెంట్ షోలతో ఎంజాయ్ చేస్తున్నారు.

కొవిడ్-19 వ్యాప్తితో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇంట్లోనే ఉంటూ ఎంటర్ టైన్మెంట్ షోలతో ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది వీడియో గేమ్స్ ఆడుతూ లాక్ డౌన్ సమయాన్ని బిజీగా గడిపేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ Twitch, Youtube యాప్‌ల ద్వారా యూజర్లను ఫావరేట్ షోలతో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా కొత్త గేమింగ్ యాప్ తీసుకొచ్చింది.
సొంత మొబైల్ యాప్ ద్వారా గేమింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గేమింగ్ ఫ్రీ యాప్‌ను సోమవారం (ఏప్రిల్ 20) ఫేస్ బుక్ లాంచ్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులో ఉందని న్యూయార్క్ టైమ్ రిపోర్టులో తెలిపింది. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ గేమింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆపిల్ నుంచి ఒకసారి ఆమోదం లభించిన వెంటనే iOS వెర్షన్ లో కూడా గేమింగ్ యాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.
160 బిలియన్ డాలర్ల గేమింగ్ ఇండస్ట్రీలోకి ఫేస్ బుక్ తొలి ప్రయత్నం వచ్చే జూన్ నుంచి ప్రారంభం కానుంది. లాక్ డౌన్, క్వారంటైన్ సమయంలో గేమింగ్ టెక్నాలజీకి ఎక్కువ ఆదరణ ఉందని గమనించిన ఫేస్ బుక్… గేమింగ్ యాప్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ఫేస్ బుక్ గేమింగ్ యాప్ ప్రెసిడెంట్ Fidji Simo వెల్లడించారు.
ప్రస్తుతం.. కోర్ ఫేస్‌బుక్ యాప్ ద్వారా గేమ్స్ చూడవచ్చు. స్ట్రీమింగ్ చేయవచ్చు. కానీ ఫేస్‌బుక్ 2.5 బిలియన్ నెలవారీ యూజర్లతో కూడా స్ట్రీమింగ్ ల్యాండ్‌స్కేప్ అతిపెద్ద పోటీదారులతో పోటీ పడటానికి ప్రయత్నిస్తోంది. స్ట్రీమ్‌ల్యాబ్స్ ప్రకారం.., గూగుల్ యూట్యూబ్ గేమింగ్ , అమెజాన్ Twitch తర్వాత చూసిన మొత్తం గంటల్లో ఫేస్‌బుక్ గేమింగ్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు Twitchలో స్ట్రీమింగ్ చేసిన 121.4 మిలియన్ గంటలలో ఫేస్‌బుక్ గేమింగ్ సగటున 5శాతం కన్నా తక్కువగా ఉందని తెలిపింది.
యూజర్లు తమ ప్లే సెషన్లను యాప్ ద్వారా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ‘Go Live’ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా యూజర్లు ఇతర మొబైల్ గేమ్స్ స్ట్రీమ్‌లను ఒకే డివైజ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ఇందుకు కొన్ని బటన్లను నొక్కడం ద్వారా అనుమతిని పొందవచ్చు. ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మొబైల్ గేమ్స్ స్ట్రీమ్ చేయడానికి అదనంగా థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ అవసరం. ఎందుకంటే ప్రధానంగా PCలోని ప్లేయర్‌లకు సపోర్ట్ ఇవ్వడానికి వాటి ప్రధాన యూజర్‌బేస్ అనుకూలంగా ఉంటాయని ఫేస్ బుక్ గేమింగ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ శర్మ టైమ్స్‌తో తెలిపారు.
Also Read | నేటి నుంచి లాక్ డౌన్ కు పాక్షిక సడలింపు…రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినం