వాట్సాప్ Loginతో ఫేస్‌బుక్ వీడియో కాల్

ఫేస్ బుక్ వీడియో కాల్ చేస్తున్నారా? మీకు వాట్సాప్ అకౌంట్ ఉందా? వాట్సాప్ లాగిన్ అయితే చాలు.. ఈజీగా ఫేస్ బుక్ వీడియో కాల్ చేసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా? ఫేస్ బుక్ వీడియో కాలింగ్ డివైజ్ పోర్టల్ వాట్సాప్ నుంచి వీడియో కాలింగ్ వర్క్ అవుతుంది.
స్టోరీ టైమ్.. వంటి ఫీచర్లను యాక్సస్ చేయడం ద్వారా మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేకపోయినప్పటికీ.. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అనుబంధ వాస్తవికత (AR)తో ‘Story Time’ ఫీచర్ మీ జీవితంలోకి చిన్నారుల స్టోరీలను తీసుకొస్తోంది. దీనిద్వారా క్యారెక్టర్లకు మ్యాచ్ అయ్యేలా మిమ్మల్ని మార్చేస్తుంది. ‘క్లాసిక్ స్టోరీలకు కొత్త అనువాదాలను చేర్చాం.
లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్, గోల్డ్ లాక్స్, త్రి బియర్స్, వాటికి తోడు లాల్మా లాల్మా, పీటె ది క్యాట్ అండ్ ఒట్టో నుంచి ప్లస్ న్యూ టేల్స్’ కూడా యాడ్ చేసినట్టు ఫేస్ బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో కాల్ డివైజ్ పోర్టల్ పై మీ సహో ఉద్యోగులతో గట్టి సంబంధాలను పెంచుకోవచ్చు. పోర్టల్ టీవీ ద్వారా అతిపెద్ద స్ర్కీన్ ద్వారా పోర్టల్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. మీ కాల్ ఎవరైనా మిస్ అయితే వారికి వీడియో మెసేజ్ పంపవచ్చు.
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అందుబాటులో లేని సమయంలో వీడియో మెసేజ్ చేసుకోవచ్చు. మెసేంజర్ ద్వారా మీ సూపర్ ఫ్రేమ్ ఫీడ్ నుంచి ఫొటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. పోర్టల్ టీవీపై కొత్త స్ట్రీమింగ్ పార్టనర్లకు సంబంధించి వేలాది షోలను ఫేస్ బుక్ యాడ్ చేయనుంది.
ఇందులో అమెరికా, యూకే, కెనడా సహా ఫ్రాన్స్ తో ఫ్యాండ్యాంగోనౌ, స్లింగ్ టీవీతో సహా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా అందిస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఈ ఫీచర్లను యాడ్ చేసింది. ఫేస్ బుక్ యూజర్లు తమ ప్రొఫైల్ ద్వారా నేరుగా పోర్టల్ నుంచి లైవ్ స్ట్రీమ్ ఫేస్ బుక్ లైవ్ చేసుకోవచ్చు.