Flipkart Big Bachat Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు.. డోంట్ మిస్!
Flipkart Big Bachat Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆగస్టు 13తో ముగియనుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లు, ఎలక్టానిక్స్, ఫర్నిచర్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.

Flipkart Big Bachat Dhamaal Sale up to 80 percent off on smartphone
Flipkart Big Bachat Dhamaal Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏదైనా ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ (Flipkart Big Bachat Dhamaal Sale) ప్రారంభించింది. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆగస్టు 13 వరకు కస్టమర్లు బల్క్ వస్తువులను డిస్కౌంట్లపై కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు 80 శాతం వరకు తగ్గింపుతో అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సేల్‌లో 1 లక్షకు పైగా ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి.
ఏ వస్తువులను కొనుగోలు చేస్తారు? :
అతి తక్కువ ధరకు అనేక కేటగిరీల వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.499, రూ.699, రూ.799, రూ.999 ధరల రేంజ్‌లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టీవీలు, దుస్తులు, గృహోపకరణాలు, డెకర్ & ఫర్నిషింగ్‌లు, ఫర్నిచర్, కిరాణా, బ్యూటీ, మేకప్ ప్రొడక్టుల కొనుగోలు చేయవచ్చు.

Flipkart Big Bachat Dhamaal Sale up to 80 percent off on smartphone
తగ్గింపు ఎంతంటే? :
మీరు ప్రతి కేటగిరీలో తగ్గింపులతో ఈ సేల్‌లో షాపింగ్ చేయవచ్చు. క్రీడలు, ఫిట్‌నెస్ ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. గృహోపకరణాలపై 70 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు తగ్గింపు, పురుషుల దుస్తులపై 60-70 శాతం వరకు డిస్కౌంట్, వ్యక్తిగత సంరక్షణపై 60 శాతం వరకు తగ్గింపు, కిరాణా సామాగ్రిపై 70 శాతం తగ్గింపు పొందవచ్చు.
10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మీరు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేస్తే.. 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు కూడా పొందవచ్చు. వివిధ ఆఫర్ల కింద బ్యూటీ, డెకరేషన్, షూలు, బట్టలు మొదలైనవాటిని చౌకైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. మహిళలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయొచ్చు. అదే సమయంలో, మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎలక్ట్రిక్, పెట్రోల్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. హీరో మోటోకార్ప్, విడా బ్రాండ్‌ల కింద బైక్‌లు, స్కూటర్లు ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో ఉన్నాయి.