ఈ-మెయిల్ పంపడం ఎంతో ఈజీ : Gmail పుట్టి 15 ఏళ్లు.. రెండు కొత్త ఫీచర్లు ఇవే

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో జీమొయిల్ సర్వీసు ఒకటి.. ఈ జీమెయిల్ సర్వీసు పుట్టి ఏప్రిల్ 1, 2019 నాటికి 15 ఏళ్లు. ఏప్రిల్ 1, 2004లో జీమెయిల్ సర్వీసును ప్రవేశపెట్టారు.

  • Published By: sreehari ,Published On : April 2, 2019 / 06:13 AM IST
ఈ-మెయిల్ పంపడం ఎంతో ఈజీ : Gmail పుట్టి 15 ఏళ్లు.. రెండు కొత్త ఫీచర్లు ఇవే

Updated On : April 2, 2019 / 6:13 AM IST

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో జీమొయిల్ సర్వీసు ఒకటి.. ఈ జీమెయిల్ సర్వీసు పుట్టి ఏప్రిల్ 1, 2019 నాటికి 15 ఏళ్లు. ఏప్రిల్ 1, 2004లో జీమెయిల్ సర్వీసును ప్రవేశపెట్టారు.

శాన్ ఫ్రాన్సిస్ కో : ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం Google అందించే సర్వీసుల్లో జీమొయిల్ సర్వీసు ఒకటి.. ఈ జీమెయిల్ సర్వీసు పుట్టి ఏప్రిల్ 1, 2019 నాటికి 15 ఏళ్లు. ఏప్రిల్ 1, 2004లో జీమెయిల్ సర్వీసును ప్రవేశపెట్టారు. Gmail ను పాల్ బచ్చెయిట్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ జీమెయిల్ సర్వీసును మిలియన్ల మంది యూజర్లు వాడుతున్నారు.  15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గూగుల్ కంపెనీ.. జీమెయిల్ సర్వీసుల్లో కొత్త అప్ డేట్స్ ప్రవేశపెట్టింది. జీమెయిల్ Smart Compose ఫంక్షన్, Schedule Emails ఫీచర్ అప్ డేట్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

స్మార్ట్ కంపోజ్ లోయూజర్లు వెబ్ లో వారానికి 1 బిలియన్ (వంద కోట్లు) క్యారెక్టర్లు  టైప్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ఇటీవల స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ను రిలీజ్ కాగా.. తొలుత గూగుల్ ఫిక్సల్ సిరీస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల అందరికి అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ కంపోజ్ ఫీచర్ లో నాలుగు కొత్త లాంగ్వేజీలను గూగుల్ అప్ డేట్ చేసింది. అందులో స్పానీష్, ఫ్రెంచ్, ఇటాలీయన్, పోర్చుగ్రీసు ఉన్నాయి. స్మార్ట్ కంపోజ్ ఫీచర్ త్వరలో  iOS యూజర్లకు కూడా అందుబాటులో రానుంది.

షెడ్యూల్ జీమెయిల్ సర్వీసు కూడా యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. యూజర్లు జీమెయిల్ నుంచి మెయిల్ పంపేటప్పుడు Send బటన్ పై క్లిక్ చేయగానే.. అక్కడ Drop-down మెనూ కనిపిస్తుంది. ఇక్కడ మీరు పంపాల్సిన ఈమెయిల్ ను నేరుగా టైమ్ షెడ్యూల్ ప్రకారం పంపవచ్చు. ఇప్పటివరకూ ఇలా షెడ్యూల్ ఈమెయిల్ చేయాలంటే థర్డ్ పార్టీ సర్వీసులతో చేయాల్సి వచ్చేది. జీమెయిల్ అందిస్తున్న షెడ్యూల్ ఈమెయిల్ సర్వీసు ఫీచర్ ద్వారా నేరుగా ఈమెయిల్ ను షెడ్యూల్ చేసి పంపవచ్చు. 

బిజినెస్, పర్సనల్ జీమెయిల్స్ యూజర్లతో కలిపి మొత్తం జీమెయిల్ సర్వీసునువాడే వారిలో నెలవారీగా 1.5 బిలియన్ల (150 కోట్లు) మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. జీమెయిల్ వాడే ఒక్కో యూజర్ కు ప్రారంభంలో స్టోరేజీ కేపాసిటీ ఒక (One Gigabyte) గిగాబైట్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం జీమెయిల్ 15GB వరకు ఉచితంగా స్టోరేజీ అందిస్తోంది. అంటే.. యూజర్లు 50MB వరకు ఈమెయిల్స్, అటాచ్ మెంట్స్  పొందవచ్చు. ఈమెయిల్స్ Send చేయాలంటే.. 25MB వరకు పంపుకోవచ్చు. ఒకవేళ భారీ ఫైల్స్ ను జీమెయిల్ ద్వారా పంపాలంటే మాత్రం గూగుల్ డ్రైవ్ ఉండనే ఉంది. 

మరోవైపు ఏప్రిల్ 2 నుంచి గూగుల్ అందించే సర్వీసుల్లో ప్రధానమైనవి గూగుల్ ప్లస్ (Google plus), Inbox by Gmail App.. ఈ రెండు సర్వీసులను గూగుల్ నిలిపివేయనుంది.