Google Pixel 9 Pro Fold : ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్.. మడతబెట్టే ఫోన్ ధర ఎంతంటే?

Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 53వేలు తగ్గింపు పొందింది.

Google Pixel 9 Pro Fold : ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్.. మడతబెట్టే ఫోన్ ధర ఎంతంటే?

Google Pixel 9 Pro Fold

Updated On : October 26, 2025 / 6:46 PM IST

Google Pixel 9 Pro Fold : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొంటున్నారా? మడతబెట్టే ఫోన్లు కూడా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. మీరు ఫోల్డబుల్ ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ.1,70,000తో లాంచ్ అయిన ఈ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు రూ.1,20,000 లోపు ధరకు అందుబాటులో ఉంది.

ట్రిపుల్ కెమెరా, డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, ఫారమ్ ఫ్యాక్టర్ (Google Pixel 9 Pro Fold) వంటి మరెన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర రూ.1,19,999కి లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర రూ.1,72,999 నుంచి తగ్గింది. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ.4వేల వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ.1,15,999కి తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ప్రస్తుత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ.61,900 వరకు అద్భుతమైన వాల్యూను పొందవచ్చు.

Read Also : New Bank Rule : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇకపై 4 నామినీలను యాడ్ చేసుకోవచ్చు!

అయితే, డిస్కౌంట్ అనేది వర్కింగ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఆసక్తిగల కొనుగోలుదారులు అవసరాలను బట్టి ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు. కస్టమర్ అదనపు పేమెంట్ ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీని ఎంచుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 6.3-అంగుళాల OLED కవర్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 8-అంగుళాల OLED మెయిన్ ప్యానెల్‌ కూడా అందిస్తుంది. టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 4,650mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. యాడ్ మీ, ఆటో ఫ్రేమ్, మ్యాజిక్ లిస్ట్, పిక్సెల్ స్టూడియో వంటి అనేక ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ OISతో 48MP మెయిన్ సెన్సార్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 10.5MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో సెన్సార్‌ కూడా అందిస్తుంది. డ్యూయల్ 10MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంది.