CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్.. మీ డివైజ్‌లను వెంటనే ప్రొటెక్ట్ చేసుకోండి!

CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్‌లో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ భద్రతా లోపం కారణంగా డివైజ్‌ల్లో సులభంగా ఇంజెక్ట్ కాగలదు. ఇందుకోసం ఆర్బిటరీ కోడ్‌ని రన్ చేస్తుంది.

CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్.. మీ డివైజ్‌లను వెంటనే ప్రొటెక్ట్ చేసుకోండి!

Government issues a high severity warning for Apple iPhone and iPad users

CERT-In Alert for Apple Users : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఆపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ డివైజ్‌లకు హెచ్చరికను జారీ చేసింది. ఈ హెచ్చరిక మార్చి 15న జారీ అయింది. అధికారిక CERT-In వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. సీఈఆర్‌టీ హెచ్చరిక ప్రకారం.. ఆపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్‌లో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ భద్రతా లోపం కారణంగా డివైజ్‌ల్లో సులభంగా ఇంజెక్ట్ కాగలదు. ఇందుకోసం ఆర్బిటరీ కోడ్‌ని రన్ చేస్తుంది. తద్వారా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతమయ్యేలా చేస్తుంది.

Read Also : Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

ఆపిల్ ప్రొడక్టుల్లోని భద్రతా లోపం ప్రధానంగా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐప్యాడ్ 5వ జనరేషన్, ఐప్యాడ్ ప్రో 9.7 అంగుళాలు, ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాల ఫస్ట్ జనరేషన్ వంటి డివైజ్‌ల కోసం 16.7.6 కన్నా ముందు ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌లను ప్రభావితం చేస్తుంది. ఐఫోన్ ఎక్సఎస్ కొత్తది కూడా ఐప్యాడ్ ప్రోలో 12.9-అంగుళాల 2వ జనరేషన్ కొత్తది, ఐప్యాడ్ ప్రో 10.5-అంగుళాలు, ఐప్యాడ్ ప్రో 11-అంగుళాల 1వ జనరేషన్ కొత్తది, ఐప్యాడ్ ఎయిర్ 3వ జనరేషన్ కొత్తది, 6వ జనరేషన్ కొత్తది, ఐప్యాడ్ మినీ 5వ జనరేషన్ కొత్తది, ఐప్యాడ్ వంటి డివైజ్‌లలో v17.4కి ముందు వెర్షన్‌లను కూడా ఈ భద్రతా లోపం ప్రభావితం చేస్తుంది.

(CERT) హెచ్చరిక ప్రకారం.. :
ఆపిల్ iOS, ఐప్యాడ్ OSలో భద్రతపరమైన సమస్యలకు అందులోని బ్లూటూత్, libxpc, MediaRemote, Photos, Safari & WebKit పార్టులలో ధృవీకరించని కారణంగానే సంభవించాయి. ExtensionKit, Messages, Share Sheet, Synapse & Notes భాగాలలో కూడా ప్రైవసీ పరమైన సమస్యలు ఉన్నాయి. మరొక సమస్య ఏమిటంటే.. (ImagelO) అనేది కూడా ఫుల్ లోడ్ అయింది. కెర్నల్ & (RTKit) భాగాలు మెమరీలో కూడా సమస్యలు ఉండవచ్చు. సఫారీ ప్రైవేట్ బ్రౌజింగ్ అండ్ శాండ్‌బాక్స్‌లో కూడా సమస్య ఉంది.

అయితే, సిరికి లాక్ స్క్రీన్ సమస్య ఉంది. కోర్‌క్రిప్టో టైమ్ ఇష్యూ కూడా ఉంది. ఈ భద్రతా లోపాలతో సిస్టమ్ వైఫల్యాలు, అనధికార కోడ్‌ రన్ చేయడం, ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేయడం వంటి వాటికి దారితీయవచ్చు. అలాంటి దుర్బలత్వాల నుంచి మీ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు ఈ కిందివిధంగా ప్రయత్నించండి.

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి : మీ ఆపిల్ iOS, ఐప్యాడ్ OS డివైజ్‌లు లేటెస్ట్ వెర్షన్‌లను రన్ అయ్యేలా చూసుకోండి. సెక్యూరిటీ పరంగా సమస్యలను పరిష్కరించడానికి తయారీదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తారు. క్రమం తప్పకుండా అప్‌డేట్‌లను చెక్ చేయండి. ఆ తర్వాతే ఇన్‌స్టాల్ చేయండి.

సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేయండి : వినియోగదారుల డివైజ్‌ల భద్రత కోసం (CERT-In) ద్వారా పేర్కొన్న భద్రతా లోపాలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఆపిల్ అందించిన ఏదైనా సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటే వెంటనే ఉపయోగించండి.

సేఫ్ కనెక్షన్‌లను మాత్రమే వాడండి : అసురక్షిత లేదా పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీ డివైజ్ అనధికారిక యాక్సెస్ రిస్క్ మరింత పెంచుతాయి.

టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) : ఈ టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) వంటి అదనపు సెక్యూరిటీ లేయర్లను ఎనేబుల్ చేసుకోవాలి. ఎవరైనా మీ డేటాను యాక్సస్ చేసినప్పటికీ అనధికార యాక్సస్ నిరోధించడంలో సాయపడుతుంది.

డౌన్‌లోడ్‌లతో జాగ్రత్త : ఆపిల్ యాప్ స్టోర్ వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారాల నుంచి మాత్రమే యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. గుర్తుతెలియని లేదా అనుమానాస్పద సైట్ల నుంచి ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు.

డేటాను బ్యాకప్ చేయండి : భద్రతా ఉల్లంఘన జరిగినప్పుడు డేటా నష్టం పోకుండా ఉండేందుకు మీ డేటాను తరచూ బ్యాకప్‌ తీసుకుంటూ ఉండాలి.

ఆపిల్ వంటి అధికారిక సైట్ల నుంచి సెక్యూరిటీ వార్నింగ్స్ విషయంలో అప్‌డేట్‌గా ఉండండి. తద్వారా మీ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ జాగ్రత్తలతో వినియోగదారులు సైబర్ నేరాల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. అంతేకాదు.. ఆపిల్ డివైజ్‌ల్లో సెక్యూరిటీ మరింత పెంచుకోవచ్చు.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?