ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త నిబంధన.. ఈ యూజర్లు ఇకపై లైవ్ ఫీచర్ వాడలేరు.. ఫుల్ డీటెయిల్స్‌

అనవసర లైవ్ స్ట్రీమింగ్‌లను తగ్గించి, మెరుగైన లైవ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త నిబంధన.. ఈ యూజర్లు ఇకపై లైవ్ ఫీచర్ వాడలేరు.. ఫుల్ డీటెయిల్స్‌

Updated On : August 3, 2025 / 5:47 PM IST

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ ఫీచర్‌పై కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పటివరకు యూజర్లు ఎవరైనా సరే లైవ్‌ ఫీచర్‌ను వాడుకునే అవకాశం ఉండేది. కానీ తాజా రిపోర్టుల ప్రకారం.. ఇకపై కనీసం 1,000 మంది ఫాలోవర్లు ఉండేవారు, పబ్లిక్ అకౌంట్ ఉన్నవారే లైవ్‌ ఫీచర్లు వాడుకునే అవకాశం ఉంటుంది. 1,000 ఫాలోవర్లు ఉన్నవారే లైవ్‌లోకి వెళ్లే నిబంధన ఇప్పటికే టిక్‌టాక్‌లోనూ ఉంది.

ఒకవేళ లైవ్ కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేనివారు లైవ్‌ స్టార్ట్‌ చేయాలని ప్రయత్నిస్తే, ‘‘మీరు లైవ్‌లోకి వెళ్లడాని మీ అకౌంట్‌కు అర్హత లేదు. ఈ ఫీచర్ వినియోగ నిబంధనలు మార్చాం. ఇకపై పబ్లిక్ అకౌంట్లు, కనీసం 1000 ఫాలోవర్లతో ఉండేవారే లైవ్ వీడియోలు చేసే వీలుంది’’ అనే మెసేజ్ కనిపిస్తుంది.

Also Read: ఈ స్టార్‌ క్రికెటరే కాదు.. ఇతడి భార్య కూడా సూపర్ టాలెంటెడ్‌.. ఏం చేస్తోందంటే?

ఈ కొత్త నిబంధన ఎందుకు తీసుకొచ్చారన్న విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌ అధికారికంగా కారణాలు వెల్లడించలేదు. అయితే, అనవసర లైవ్ స్ట్రీమింగ్‌లను తగ్గించి, మెరుగైన లైవ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

టిక్‌టాక్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్ కూడా ఇదే విధమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. టిక్‌టాక్‌లో కూడా లైవ్‌కి కనీసం 1,000 ఫాలోవర్లు అవసరం. యూట్యూబ్ క్రియేటర్లకు లైవ్ స్ట్రీమింగ్‌కి కనీసం 50 మంది సబ్‌స్క్రైబర్లు అవసరం.

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల స్పందన
లైవ్‌ ఫీచర్ విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకున్న నిర్ణయం చాలామందికి నచ్చలేడం లేదు. ముఖ్యంగా తక్కువ ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లు, సాధారణ యూజర్లపై ప్రభావం ఉంటుందని యూజర్లు అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌ నిర్ణయంతో చాలా మంది నకిలీ ఫాలోవర్లను, లైకుల్ని, కామెంట్లను తయారు చేసే ఆటోమేటెడ్ అకౌంట్ల నెట్‌వర్క్ “బాట్ ఫార్మ్‌”ను ఆశ్రయిస్తారని ఓ యూజర్ పేర్కొన్నాడు.