Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు.

Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

iPhone 13 is available at a discounted price

Apple iPhone 13 : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 13 మరోసారి తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 52,090 ప్రారంభ ధరతో క్రోమా, అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఐఫోన్ బేస్ మోడల్ 128జీబీ స్టోరేజ్ రెండు ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం డివైజ్‌ను వేర్వేరు కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నాయి.

క్రోమాలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. వెయ్యి తగ్గింపును అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర ప్రభావవంతంగా రూ.51,090కి తగ్గుతుంది. అమెజాన్‌లో ప్రస్తుతం బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను జాబితా చేయలేదు. అయితే, ఐఫోన్ 13ని తక్కువ ధరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

Read Also : Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 13 తక్కువ ధరకు :
ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు. లేదంటే.. ఐఫోన్ 13ని కూడా కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. మీ బడ్జెట్ దాదాపు రూ. 50వేలు అయితే, ఐఫోన్ 13ని ఇదే ధర వద్ద కొనుగోలు చేయొచ్చు.

కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 13 ఛార్జింగ్ ఒక రోజుంతా ఉండదు. యూజర్ల వినియోగ పద్ధతిని బట్టి ఒకటి లేదా రెండుసార్లు ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపీ68 రేటింగ్‌కు సపోర్టును కలిగి ఉంది. ఈ ఐఫోన్ 13 కోసం కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రూ. 66వేలకు ఐఫోన్ 15 కొనొచ్చు :
ఐఫోన్ 15 వంటి ఆపిల్ డివైజ్ విషయంలో ఉండదు. ఎందుకంటే.. కొత్తది యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, కొత్త ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లు రూ. 70వేలకి కొనుగోలు చేయొచ్చు. ఈ ఐఫోన్ అసలు ధర రూ. 79,900గా ఉంది.

అయితే, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌లతో రూ.65,999కి పొందవచ్చు. ఆపిల్ కొత్త డైనమిక్ ఐలాండ్ డిజైన్, వేగవంతమైన చిప్‌సెట్, బ్రైట్ డిస్‌ప్లే మరిన్నింటిని కలిగి ఉంది. ఐఫోన్ యూజర్లు ఒక రోజు కన్నా తక్కువ బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. కొత్త 48ఎంపీ కెమెరా సిస్టమ్‌తో 4కె సినిమాటిక్ మోడ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Asus Zenbook Duo : డ్యూయల్ స్ర్కీన్ డిస్‌ప్లేతో కొత్త అసుస్ జెన్‌బుక్ డుయో 14 ల్యాప్‌టాప్.. ఫీచర్లు, ధర వివరాలివే!