iPhone 14 Plus Launch India : కొత్త ఎల్లో కలర్ ఆప్షన్లతో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంతంటే?
iPhone 14 Plus Launch India : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం సరికొత్త వేరియంట్‌తో ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వచ్చేసింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ప్రస్తుత మిడ్ నైట్, స్టార్‌లైట్, రెడ్, బ్లూ, పర్పల్ కలర్లలో ఉంటుంది.

Apple iPhone 14 and iPhone 14 Plus get new yellow colour option in India
iPhone 14 Plus Launch India : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం సరికొత్త వేరియంట్‌తో ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వచ్చేసింది. ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్ భారత మార్కెట్ సహా ఇతర ప్రపంచ మార్కెట్‌లలో కొత్త ఎల్లో కలర్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ప్రస్తుత మిడ్ నైట్, స్టార్‌లైట్, రెడ్, బ్లూ, పర్పల్ కలర్లలో ఉంటుంది. కొత్త కలర్ ఆప్షన్‌లో ఇతర ఐఫోన్ల మాదిరిగానే అదిరిపోయే స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ కొత్త వేరియంట్ ధరలో ఎలాంటి మార్పులేదని గమనించాలి.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ (ఎల్లో వేరియంట్) ధరలివే :
భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో కలర్ వేరియంట్ ధరలు వరుసగా రూ. 79,900, రూ. 89,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ డ్యుయల్ ఫోన్లు 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ కొత్త కలర్ ఆప్షన్ సేల్.. మార్చి 14 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, కస్టమర్‌లు మార్చి 10న డివైజ్‌ని ప్రీ-బుక్ (Free-Booking) చేసుకోవచ్చు. అదనంగా, ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సిలికాన్ కేసులలో కానరీ ఎల్లో, ఆలివ్, స్కై, ఐరిస్ వంటి 4 కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 14 ప్లస్ (ఎల్లో వేరియంట్) స్పెసిఫికేషన్‌లు :
iPhone 14, iPhone 14 Plus ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. స్క్రీన్ సైజ్, బ్యాటరీ సామర్థ్యంలో ఎలాంటి తేడా ఉండదు. వెనిలా మోడల్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ప్లస్ మోడల్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ గత ఏడాదిలో ప్లస్ వేరియంట్‌పై కంపెనీ ఐఫోన్ మినీ మోడల్‌ను నిలిపివేసింది. ఈ రెండు ఫోన్‌లు A15 బయోనిక్ SoC (సిస్టమ్-ఓవర్-చిప్) ద్వారా పవర్ అందిస్తాయి. ఇందులో 5-కోర్ GPU, 6-కోర్ CPU ఉంటాయి. iPhone 13లోని A15 బయోనిక్ SoCలో 6-కోర్ CPU, 4-కోర్ GPU ఉన్నాయి.
అదనపు కోర్లలో CPUలు, GPUలు పవర్ వినియోగించకుండా మరింత పర్ఫార్మెన్స్ అందిస్తాయి. డిస్ప్లే సైజుల్లో తేడాలు ఉన్నప్పటికీ.. ఆపిల్ (iPhone 14), iPhone 14 Plus డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తాయి. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్ట్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లు వెనుకవైపు రెండు 12-MP కెమెరాలతో (వైడ్, అల్ట్రా-వైడ్) వస్తాయి. ఫ్రంట్ సైడ్ 12-MP కెమెరా సెన్సార్ కూడా ఉంది. అన్ని కెమెరాలు 60fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయగలవు.

iPhone 14 Plus Launch India : Apple iPhone 14 and iPhone 14 Plus get new yellow colour option in India
ఐఫోన్ 14 లైనప్ మెరుగైన లో-లైటింగ్ ఫోటోగ్రఫీ కోసం ‘ఫోటోనిక్ ఇంజిన్’ని అందించనుందని ఆపిల్ తెలిపింది. ఆపిల్ వినియోగదారులు యాక్షన్, సినిమాటిక్ వీడియో మోడ్‌లను కూడా పొందవచ్చు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, యుకె, అమెరికా యూజర్ల కోసం iPhone 14, iPhone 14 ప్లస్ వేరియంట్‌లు జీరో సెల్యులార్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో యూజర్లకు మెసేజ్ పంపడానికి శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తాయి.
ఈ ఫీచర్ యాక్సస్ పొందాలంటే.. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆమోదం అవసరమని గమనించాలి. అందుకే ఈ ఫీచర్ భారత మార్కెట్లో అందుబాటులో లేదు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కూడా క్రాష్ డిటెక్షన్‌తో వస్తాయి. తీవ్రమైన కార్ క్రాష్‌ను గుర్తించడానికి, యూజర్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లేదా వారి ఐఫోన్‌ను చేరుకోలేనప్పుడు ఆటోమాటిక్‌గా అత్యవసర సేవలకు డయల్ చేసేందుకు Apple రూపొందించిన అల్గారిథమ్‌లతో స్పెషల్ ఫీచర్లను అందిస్తోంది.