iPhone 17 Proలో కొత్త డిజైన్‌.. భారీ బ్యాటరీ.. అంతేకాదు ఈ మార్పులు కూడా..

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో డిజైన్ పరంగా ఎన్నో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

iPhone 17 Proలో కొత్త డిజైన్‌.. భారీ బ్యాటరీ.. అంతేకాదు ఈ మార్పులు కూడా..

Updated On : April 22, 2025 / 9:32 AM IST

ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబరులో ఐఫోన్ 17ను విడుదల చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లు అనేక అప్‌గ్రేడ్లతో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్, కెమెరా, బ్యాటరీ, పనితీరు వంటి ఫీచర్లలో అనేక మార్పులు ఉండనున్నాయి. ఐఫోన్ 17 ప్రో గురించి మరిన్ని లీకులు వచ్చాయి.

ఐఫోన్ 17 ప్రో డిజైన్
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో డిజైన్ పరంగా ఎన్నో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌ కెమెరా మాడ్యూల్‌పై దృష్టి పెట్టింది. స్క్వేర్ కెమెరా బంప్ కాకుండా, హారిజాంటల్‌ కెమెరా బార్‌ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కెమెరా లెన్స్ అలైన్‌మెంట్‌ మాత్రం మారకపోవచ్చు. ఫ్లాష్, లిడార్ సెన్సార్ దానికి అపోజిట్‌ సైడ్‌లో రావచ్చు.

Also Read: హీరో మహేశ్‌ బాబుకు షాక్.. ఈడీ నోటీసులు జారీ

అదనంగా, ఆపిల్ ప్రో మోడళ్లలో అల్యూమినియం చాసిస్‌ను తిరిగి తీసుకురావచ్చు. ఇప్పటికే ఉన్న ప్రో మోడల్ ఐఫోన్‌లలో స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియంను వాడారు.

కెమెరా, బ్యాటరీ
కెమెరా సిస్టమ్‌లో అప్‌గ్రేడ్లు రానున్నాయి. ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ రెండూ అప్‌గ్రేడ్ చేసిన 48MP టెలిఫోటో లెన్స్‌తో రావచ్చు. మొత్తం 48 ఎంపీ బ్యాక్‌ కెమెరా సెటప్‌తో వచ్చే మొదటి ఐఫోన్‌లు ఇవే. ప్రస్తుతం ప్రో మాక్స్‌లో ఉన్న 5x జూమ్‌తో పోలిస్తే టెలిఫోటో లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్ తో రానుంది. ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్ అన్ని వేరియంట్లలో 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండొచ్చు.

iPhone 17 Pro సిరీస్‌ను iPhone 16 Pro మోడల్స్ కంటే కొంచెం తికర్‌ (మందంగా)గా తయారు చేయాలని ఆపిల్ యోచిస్తోంది. iPhone 17 Pro Max మందం 8.725mm ఉంటుంది. అయితే iPhone 16 Pro Max 8.25mm మందంగా ఉంది. iPhone 17 Pro Maxలో పెద్ద బ్యాటరీకి సరిపోయేలా ఈ మార్పులు చేస్తున్నారు. iPhone 17 Pro Maxలో కొత్త ఫీచర్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్. iPhone 17 Pro మోడల్స్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి