జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే 

ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2019 సీజన్ లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు జియో స్పెషల్ ఆఫర్ అందిస్తోంది.

  • Published By: sreehari ,Published On : April 15, 2019 / 09:57 AM IST
జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే 

Updated On : April 15, 2019 / 9:57 AM IST

ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2019 సీజన్ లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు జియో స్పెషల్ ఆఫర్ అందిస్తోంది.

ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2019 సీజన్ లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు జియో స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. జియో సబ్ స్ర్కైబర్ల కోసం.. క్రికెట్ 4G డేటా ప్లాన్ రూ.251 ప్రవేశపెట్టింది. 2018 ఐపీఎల్ సీజన్ సమయంలో కూడా రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం రూ.251 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. 2019 ఐపీఎల్ సీజన్ లో కూడా యూజర్లను ఆకట్టుకునేందుకు అదే డేటా రీఛార్జ్ ఆఫర్ ను మళ్లీ తీసుకొచ్చింది. 
Read Also : పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే

ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్ లో తమ ఫేవరేట్ జట్ల మ్యాచ్ లను మొబైల్లో వీక్షించేందుకు ఈ 4G డేటా ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ జియో క్రికెట్ రూ.251 డేటా ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. ప్రతిరోజు 2GB డేటాను 51 రోజుల కాలపరిమితిపై పొందవచ్చు. మొత్తం జియో అందించే 4G డేటా ప్లాన్ ఆఫర్ 102GB వరకు అందిస్తోంది. 

ఈ 4G డేటా ప్లాన్ లో యూజర్లు రోజుకు 2GB డేటా మాత్రమే పొందవచ్చు. వాయిస్ కాల్స్, SMS బెనిఫెట్స్ వర్తించవు. 2GB డేటా పరిమితి దాటితే.. 64Kbps వరకు స్పీడ్ తగ్గిపోతుంది. అయినప్పటికీ ఇదే స్పీడ్ తో వాట్సాప్ చాట్ చేసుకోవచ్చు. జియో అందించే స్పెషల్ క్రికెట్ 4G డేటా ప్లాన్ ఆఫర్ తో పాటు మరిన్ని 4G డేటా ఆఫర్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ 4G డేటా ప్లాన్ ఆఫర్లలో కూడా యూజర్లు రోజుకు 2GB డేటాను పొందవచ్చు.. 
Read Also : జట్టు నుంచి ఔట్ : రాయుడు, పంత్‌కు బీసీసీఐ షాక్

రూ.198 ప్లాన్ : 
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న జియో యూజర్లు 28 రోజుల కాలపరిమితిపై 56GB డేటా పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ , 100 SMSలు డెయిలీ బేసిస్ పై పొందవచ్చు. 

రూ. 398 ప్లాన్ : 
ఈ ప్లాన్ కింద జియో యూజర్లు 70రోజుల కాలపరిమితిపై 140GB డేటా బెనిఫెట్స్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. అన్ని జియో యాప్ లకు సబ్ స్ర్కిప్షన్ ఈ డేటా ప్లాన్ వర్తిస్తుంది. 

రూ. 448 ప్లాన్ :
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే యూజర్లు 84 రోజుల కాలపరిమితిపై 168GB డేటా పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100/SMS లు డెయిలీ బేసిస్ పై పొందవచ్చు. 

రూ. 498 ప్లాన్ : 
జియో యూజర్లు ఈ డేటా ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. 91 రోజుల వరకు 182GB డేటా పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు డెయిలీ బేసిస్ పై పొందవచ్చు. 
Read Also : 2019 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..