Jio Tariff Plans : మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచినా జియోనే చౌక.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?

Jio Tariff Plans : ఎయిర్‌టెల్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల కన్నా జియో అత్యంత సరసమైన ధరకే ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలోనూ 29శాతం తక్కువ ధరకు అందిస్తోంది.

Jio Tariff Plans : మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచినా జియోనే చౌక.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?

Jio Tariff Plans _ Reliance Jio offers all Prepaid and Postpaid plans ( Image Source : Google )

Jio Tariff Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు మొబైల్ టారిఫ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేశాయి. ఈ నెల 3 నుంచి పెంచిన కొత్త రీఛార్జ్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ టెలికం కంపెనీల్లో అగ్రగామి అయిన రిలయన్స్ జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కూడా తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

Read Also : Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!

అయితే, ఈ రీఛార్జ్ ధరల పెంపు తర్వాత కూడా జియో ప్లాన్ల ధరలు ఇతర టెలికాం కంపెనీల కన్నా చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. గత వారంలో జియో 10 నుంచి 21 శాతం వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. ఆ వెంటనే ఎయిర్‌టెల్ కూడా 25 శాతం వరకు ధరలను పెంచింది. ఈ కొత్త ప్లాన్ల ధరలు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

జియో ఛార్జీలు పెంచిన అనంతరం జియో ప్లాన్ల ధరలు అత్యంత సరసమైన ధరకు లభిస్తున్నాయి. ఉదాహరణకు.. జియో యూజర్లు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ప్లాన్ ధర రూ. 249కు పొందవచ్చు. అదే భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌‌లో రూ. 299 ప్లాన్ ఉంది. జియో యూజర్లు 20 శాతం తక్కువ ధరకే ప్లాన్ తీసుకోవచ్చు. తద్వారా రూ. 50 సేవ్ చేసుకోవచ్చు. అలాగే, రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ కోసం జియోలో రూ. 299తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ ప్లాన్ల ధరలతో పోలిస్తే.. : 

ఎయిర్‌టెల్‌లో అయితే రూ. 349 ప్లాన్ అందుబాటులో ఉంది. జియో యూజర్లు 17 శాతం తక్కువ ధరతో రూ. 50 సేవ్ చేసుకోవచ్చు. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియో రూ. 349కి అందిస్తోంది. కానీ, ఎయిర్‌టెల్ మాత్రం ఇదే ప్లాన్ ధర రూ. 379కు ఆఫర్ చేస్తోంది. జియో కస్టమర్లు 9 శాతం తక్కువ ధరకే ప్లాన్ తీసుకుని రూ. 30 సేవ్ చేసుకోవచ్చు.

3 నెలల ప్లాన్లలో 6జీబీ డెటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ 3 నెలల ప్లాన్ ధర జియోలో రూ. 479కు అందుబాటులో ఉంది. అదే ఎయిర్‌టెల్‌లో 6 శాతం అంటే.. రూ. 30 ఎక్కువ ధరకు రూ. 509 ప్లాన్ అందిస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ధర జియోలో రూ. 799కు అందిస్తోంది.

ఎయిర్‌టెల్ మాత్రం 8 శాతం లేదా రూ. 60 అధిక ధరతో రూ. 859కు అందిస్తోంది. ఏడాది ప్లాన్ల విషయానికి వస్తే.. 24జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఏడాది వరకుజియో రూ. 1,899 ప్లాన్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ 5 శాతం లేదా రూ. 100 ఎక్కువ ధరతో రూ. 1,999 ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

Read Also : Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!