Microsoft Edge Browser : మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వాడుతున్నారా? విండోస్ 7, 8.1లకు ఇకపై సపోర్టు ఉండదు.. మీరు ఏం చేయాలో తెలుసా?

Microsoft Edge Browser : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) PCల్లో ఎడ్జ్ బ్రౌజర్‌కు సపోర్టును నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అదనంగా, Microsoft రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల్లో Edge WebView2కి సపోర్టును నిలిపివేయనుంది.

Microsoft Edge Browser : మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వాడుతున్నారా? విండోస్ 7, 8.1లకు ఇకపై సపోర్టు ఉండదు.. మీరు ఏం చేయాలో తెలుసా?

Microsoft Edge browser support ending for Windows 7 and 8.1_ what should you do_

Updated On : December 12, 2022 / 9:21 PM IST

Microsoft Edge Browser : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) PCల్లో ఎడ్జ్ బ్రౌజర్‌కు సపోర్టును నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అదనంగా, Microsoft రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల్లో Edge WebView2కి సపోర్టును నిలిపివేయనుంది. WebView2 అనేది అప్లికేషన్‌లలో వెబ్ కంటెంట్‌ను కంట్రోల్ చేసేందుకు డెవలప్ చేసింది. ఈ మేరకు Microsoft తన బ్లాగ్ పోస్ట్‌లో Windows 7, Windows 8.1 రెండూ జనవరి 10, 2023న ఎడ్జ్‌కి సపోర్టును నిలిపివేస్తాయని ధృవీకరించింది. రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ (విండోస్ 7, విండోస్ 8/8.1)లకు సపోర్టు నిలిపివేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్టు నిలిపివేయడం ద్వారా యూజర్లకు సెక్యూరిటీపరమైన రిస్క్ తగ్గించడంలో సాయపడుతుంది. ఎందుకంటే రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లు జనవరి 10, 2023న సపోర్టును కోల్పోతాయని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ 109, వెబ్‌వ్యూ2 రన్‌టైమ్ వెర్షన్ 109 ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్టు ఇచ్చే చివరి వెర్షన్‌ అని టెక్ దిగ్గజం ధృవీకరించింది. WebView2 SDK వెర్షన్‌లు 1.0.1519.0, ఆపై వెర్షన్‌లు ఇకపై Windows 7, Windows 8/8.1కి సపోర్ట్ చేయవని కంపెనీ తెలిపింది.

Microsoft Edge browser support ending for Windows 7 and 8.1_ what should you do_

Microsoft Edge browser support ending for Windows 7 and 8.1

Read Also : Microsoft Outlook Lite App : బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్ వెర్షన్ యాప్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Microsoft Edge వెర్షన్ 109, Webview2 రన్‌టైమ్ వెర్షన్ 109 రెండూ జనవరి 12, 2023 వారంలో రిలీజ్ కానున్నాయి. Microsoft Edge, Webview2 రన్‌టైమ్ వెర్షన్ 109 ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పని చేస్తూనే ఉన్నప్పటికీ, ఆ వెర్షన్‌లు కొత్త ఫీచర్‌లను అందుకోలేవని తెలిపింది. ఫ్యూచర్ అప్‌డేట్ లేదా బగ్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. Windows సర్వర్ 2008 R2, Windows Server 2012, Windows Server 2012 R2 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్ 109 చివరి సపోర్టు వెర్షన్ అని చెప్పవచ్చు.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్టు ఉన్నంత వరకు దీని సపోర్టు అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఎడ్జ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్న Windows 7, Windows 8.1 యూజర్లు లేటెస్ట్ Windows వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాలి. అదనంగా, ఓల్డ్ Windows వెర్షన్‌లోని Chrome యూజర్లు కూడా లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్ 7, విండోస్ 8/8.1 వెర్షన్‌లకు గూగుల్ క్రోమ్ సపోర్టును కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola Edge 30 Series : 200MP కెమెరాలతో మోటోరోలా ఎడ్జ్ 30 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?