Open AI CEO : వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు.. ఇక ఆఫీసుకు వచ్చేయండి.. కొత్త టెక్నాలజీతో అద్భుతాలు చేద్దాం.. ఓపెన్ ఏఐ సీఈఓ పిలుపు..!
Open AI CEO : ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ టెక్ కంపెనీలు రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాయి. ఆఫీసులకు ఉద్యోగులను రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. లేదంటే కఠిన విధానాలను అమలు చేస్తున్నాయి.

Open AI CEO says era of remote work is over, best products are created by techies
Open AI CEO : కరోనా పుణ్యామని వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ మొదలైంది. అప్పటినుంచి చాలావరకూ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికే పరిమితం చేశాయి. ప్రస్తుత రోజుల్లో కంపెనీ పరమైన విధానాలను అమలు చేసేందుకు ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు తిరిగి రావాల్సిందేనంటూ స్పష్టం చేశాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రప్పించేందుకు కఠినమైన విధానాలను కూడా అమలు చేస్తున్నాయి. కంపెనీ అభివృద్ధికి అవసరమైన పనులను పూర్తి చేయడంలో ఆఫీసులతో అందరితో కలిసి చేస్తేనే ఎక్కువ ఫలితాలు చూడొచ్చునని భావిస్తున్నాయి.
అందుకే చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందిగా సూచించాయి. కానీ, కొన్ని కంపెనీల ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ ఆఫీసులకు వచ్చి పనిచేసేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈఓ (OpenAI CEO), సామ్ ఆల్ట్‌మ్యాన్ (Sam Altman) ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. రిమోట్ వర్క్ ఎర ముగిసిపోయింది.. ఇకపై అందరూ ఆఫీసులకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.. ఇప్పటివరకూ ఇళ్లలో నుంచి పనిచేసింది చాలు.. ఆఫీసుకు వచ్చి బుద్ధిగా పనిచేసుకోండి అంటూ కంపెనీ సీఈఓ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
పూర్తి రిమోట్ వర్క్ ఇప్పట్లో సాధ్యపడదు :
కొత్త ప్రొడక్టులను రూపొందించాలంటే ఆఫీసు నుంచి పని చేయడమే బెస్ట్ మోడల్ అని సూచించారు, అయితే, రిమోట్ వర్క్ కారణంగా పనిలో గందరగోళానికి దారితీయవచ్చు. ఐరిష్-అమెరికన్ ఫిన్‌టెక్ కంపెనీ స్ట్రైప్ నిర్వహించిన సెషన్‌లో ఆల్ట్‌మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోం)కు వెళ్లడానికి టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదని ఆయన సూచించారు. చర్చలో భాగంగా AI ప్రస్తుత పరిస్థితి, సంబంధిత ఆందోళనలు, అభివృద్ధి చెందుతున్న కార్యాలయ సంస్కృతులపై ఆయన ప్రస్తావించారు. ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ లేదా పూర్తి ఆఫీస్ ఆధారిత పనిపై పెరుగుతున్న చర్చల మధ్య ఆల్ట్‌మ్యాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పటికే అనేక గ్లోబల్ టెక్ కంపెనీలు కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావడానికి కఠినమైన విధానాలను అమలు చేశాయి. ట్రెడేషనల్ ఆఫీసు-ఆధారిత వర్క్ మోడల్ ఉత్పాదకతకు ఆటంకం కలిగిస్తుందని గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులు సైతం విశ్వసిస్తున్నారు. స్టార్టప్ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇవ్వమని అడిగినప్పుడు.. రిమోట్ వర్క్ యుగం ఇప్పటికే ముగిసిందని ఆల్ట్‌మాన్ సూచించారు. ప్రొడక్టుల రూపకల్పనలో పూర్తి స్థాయిలో ఫలితాలను పొందాలంటే ఉద్యోగులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారాయన.
రిమోట్ వర్క్ ఎరా ముగిసింది.. ఆఫీసు బాట పట్టాల్సిందే.. :
రిమోట్ వర్క్ కూడా ఒక ప్రయోగం లాంటిదేనని ఆల్ట్‌మాన్ అభివర్ణించారు. ఆ యుగం ఇప్పుడు ముగిసింది. ‘చాలా కాలంగా టెక్ పరిశ్రమ చేసిన చెత్త పొరపాట్లలో ఇదొకటిగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎప్పటికీ పూర్తి రిమోట్‌గా వెళ్లలేరు. స్టార్టప్‌లు కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. క్రియేటివిటీకి ఎలాంటి నష్టం జరగదు. ఇప్పుడా రిమోట్ వర్క్ ప్రయోగం ముగిసింది. టెక్నాలజీ అందుకు తగినంతగా లేదు. ముఖ్యంగా స్టార్టప్‌లలో మాత్రమే ఎప్పటికీ పూర్తి రిమోట్‌గా ఉండగలరు’ అని ఆల్ట్‌మ్యాన్ పేర్కొన్నారు.

Open AI CEO says era of remote work is over, best products are created by techies
స్ట్రైప్ సహ-వ్యవస్థాపకుడు జాన్ కొల్లిసన్ ఆల్ట్‌మ్యాన్‌ను ఒక డ్రీమర్‌గా అభివర్ణించారు. ఆయన ఒకప్పుడు AI టెక్నాలజీ విషయంలో సందేహాస్పదంగా ఉన్నాడని, ఈ ఏఐ టెక్నాలజీతో మానవాళికి అస్తిత్వ ప్రమాదం ఉందని భావించి ఉండొచ్చునని జాన్ కొల్లిసన్ తెలిపారు. అందుకే AI టెక్నాలజీతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆల్ట్‌మ్యాన్ పేర్కొన్నారు. AI టూల్స్ మానవులను ఓడించగలవని ముందుగా అందరూ గ్రహించారని తెలిపారు. వాస్తవానికి ఇప్పుడే అసలైన ఆప్టిమైజ్ చేసే సిస్టమ్‌లు ఉన్నాయన్నారు. అవేమి ఏమి చేస్తున్నారో మనం దశలవారీగా చూసే విధంగా పని చేయవచ్చు. సాధారణ నెట్‌వర్క్‌లో ఏమి జరుగుతుందో మనం చూడలేమన్నారు.
ఏఐ ఆందోళనలపై చర్చకు పిలుపు :
ChatGPTకి కొత్త అప్‌డేట్‌లను యాడ్ చేసేటప్పుడు OpenAI బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆయన సూచిస్తున్నారు. ChatGPT వంటి టూల్స్ దుర్వినియోగంపై ఆల్ట్‌మ్యాన్ హెచ్చరించారు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నిబంధనలు రూపొందించాలని కోరారు. ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్‌తో పాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను కలవడానికి ఆల్ట్‌మ్యాన్‌కు పిలుపునిచ్చారు. AI టెక్నాలజీకి సంబంధించిన ఆందోళనలను చర్చించేందుకు వాటాదారులతో సమావేశం కావాలని వైట్‌హౌస్ CEOలను కోరింది.