Realme C65 Launch : రియల్‌మి C65 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ 26నే లాంచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme C65 Launch : రియల్‌మి నుంచి ఒకేవారంలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్‌తో పాటు ఎంట్రీ లెవల్ రియల్‌మి సి65 ఏప్రిల్ 26న ఆవిష్కరించనుంది.

Realme C65 Launch : రియల్‌మి C65 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ 26నే లాంచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme C65 confirmed to launch in India on April 26

Updated On : April 23, 2024 / 10:51 PM IST

Realme C65 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ముందుగా ఏప్రిల్ 24న రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఎంట్రీ-లెవల్ రియల్‌మి C65 5జీ ఫోన్ లాంచ్ కానుంది.

Read Also : JioCinema Subscription Plan : ఈ నెల 25న జియోసినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ వచ్చేస్తోంది.. ఐపీఎల్‌కు చెల్లించాల్సిందేనా!

ఈ 5జీ ఫోన్ లాంచ్‌కు ముందుగానే కంపెనీ సోషల్ మీడియా అకౌంట్లలో ఫోన్‌ను టీజ్ చేసింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. రియల్‌మి సి65 ధర రూ. 10వేల లోపు ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. వేగవంతమైన ఎంట్రీ-లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్ అని రియల్‌మి పేర్కొంది.

మీడియాటెక్ డి6300 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ రియల్‌మి సి65 అని అధికారిక టీజర్‌లు ధృవీకరిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో 120హెచ్‌జెడ్ డిస్‌ప్లేను కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్ కూడా అవుతుంది. అదనంగా, రియల్‌మి సి65 ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుందని రియల్‌మి సూచిస్తోంది. రియల్‌మి సి65 5జీ ఫ్లాట్ డిస్‌ప్లే, వృత్తాకార కెమెరా మాడ్యూల్, రియల్‌మి నార్జో 70 ప్రో లాంటి గ్రీన్ కలర్ వేరియంట్, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని టీజర్‌లు సూచిస్తున్నాయి.

రియల్‌మి C65 5జీ ఫోన్ ధర (అంచనా) :
రియల్‌మి ఈ ఏడాదిలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మి సి65 ఫోన్‌తో 2024లో భారత్ 8వ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. రియల్‌మి ఇప్పుడు సొంత డివైజ్‌లను ప్రధానంగా రీబ్రాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రియల్‌మి నార్జో 70ఎక్స్ ఫోన్ రియల్‌మి పి1 రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తోంది. రియల్‌మి 70ప్రో 5జీ మాదిరిగా ఉంది. అదేవిధంగా, ఇటీవల లాంచ్ అయిన రియల్‌మి 12ఎక్స్ 5జీ ధర రూ. 11,999తో ప్రారంభవుతుంది. రియల్‌మి C65 5జీ ఫోన్ కూడా అదే ఫీచర్లతో ధర రూ. 10వేల లోపు ఉండవచ్చు.

రియల్‌మి 12ప్రో, రియల్‌మి 12ప్రో ప్లస్ రిలీజ్ తర్వాత రియల్‌మి 12 సిరీస్ లాంచ్ అయింది. ఇందులో రియల్‌మి 12, రియల్‌మి 12 ప్లస్ ఉన్నాయి. కొంతకాలం తర్వాత రియల్‌మి 12ఎక్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ వెంటనే రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ లాంచ్ అయింది. రియల్‌మి తర్వాత రియల్‌మి పి1 5జీ పి సిరీస్‌తో లైనప్‌ను విస్తరించింది. కేవలం ఒక వారం తర్వాత, కంపెనీ ఏప్రిల్ 24న రాబోయే లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది. రియల్‌మి నార్జో 70x 5జీ ఆవిష్కరించింది. ఇప్పుడు, ఒక రోజు తర్వాత, రియల్‌మి సి65 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.

Read Also : Moto G64 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G64 5జీ ఫోన్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?