Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు కొత్త మడతబెట్టే ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి.

Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 Specifications (Photo Credit : Samsung)
Samsung Galaxy Z Fold 5 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో మరింతగా విస్తరిస్తోంది. 2023లో శాంసంగ్ గెలాక్సీ Z సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, లాంచ్‌కు ముందే శాంసంగ్ రాబోయే రెండు లీక్ స్మార్ట్‌ఫోన్‌ల కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ (Galaxy Z Fold 5), (Galaxy Z Flip 5) రెండు ఫోల్డబుల్ ఫోన్లు (Galaxy) చిప్‌సెట్, కస్టమ్ Qualcomm స్నాప్‌డ్రాగన్‌తో రానున్నాయి. గెలాక్సీ Z Fold 5 50-MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో రానుంది. అయితే, క్లామ్‌షెల్ మోడల్ (Galaxy Z Flip 5), 12-MP డ్యూయల్ రియర్ కెమెరాలతో రానుంది. Galaxy Z Fold 5 గత ఏడాదిలో (Galaxy Z Fold 4)కి సీక్వెల్ అని రానుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ Z Flip 4 తర్వాత వెర్షన్‌గా Z Flip 5 ఫోన్ రానుంది.
Read Also : Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?
టిప్‌స్టార్ (Yogesh Brar) ప్రకారం.. Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 స్పెసిఫికేషన్‌లను లీక్ చేసినట్టు తెలిపారు. Galaxy S23 లైనప్ మాదిరిగానే.. రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు Galaxy SoC సపోర్టెడ్ (Qualcomm) స్నాప్‌డ్రాగన్‌తో వస్తాయి. Galaxy S23, Galaxy S23+ Galaxy S23 Ultra Galaxy, Qualcomm Snapdragon 8 Gen 2 Mobile Platform ద్వారా అందించనుంది.

Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 Specifications (Photo Credit : Samsung)
శాంసంగ్ గెలాక్సీ (Z Fold 5) ముందున్న అదే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50-MP ప్రైమరీ సెన్సార్, 12-MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 10-MP టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు, Galaxy Z Flip 5, 12-MP ప్రైమరీ సెన్సార్, 12-MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో సహా గెలాక్సీ Z ఫ్లిప్ 4తో సరిపోలే డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించనుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కొత్త ఇమేజ్ సెన్సార్‌లు, పెద్ద కవర్ డిస్‌ప్లేలతో రానున్నాయి.
గత లీక్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ (Galaxy Z Fold 5), (Galaxy Z Flip 5) ముందున్న స్టోరేజ్ ఆప్షన్‌లతోనే వస్తాయని చెప్పవచ్చు. గతంలో 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండోది (128GB, 256GB, 512GB) స్టోరేజ్ మోడల్‌లతో వస్తుంది. గెలాక్సీ Z ఫ్లిప్ 5 బీజ్, గ్రే, లైట్ గ్రీన్, లైట్ పింక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 5 బీజ్, బ్లాక్, లైట్ బ్లూ షేడ్స్ కలర్ ఆప్షన్లలో రానున్నాయి.