గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఎలా లాంచ్ కానున్నాయో తెలుసా? అదరహో..
లాంచింగ్ సమయంలోనే అవి వన్ UI 8, ఆండ్రాయిడ్ 16 బిల్టిన్‌తో రావచ్చని తెలుస్తోంది.

శాంసంగ్ మొబైల్స్‌కు వన్ UI 7 (Android 15) అప్‌డేట్‌ను అందించడంలో ఆ కంపెనీ ప్రదర్శించిన తీరు పట్ల యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. ఆ అప్‌డేట్‌ను అందించడంలో ఆలస్యం, పారదర్శకత లేకపోవడంతో పాటు ప్రాంతాలు, డివైజ్‌లను బట్టి అప్‌గ్రేడ్లలో తేడాలు ఉండడంతో యూజర్లు విసుగెత్తిపోయారు.
దీంతో భవిష్యత్తులో వన్ యూఐ కొత్త వర్షన్‌ను అందించడంలో కూడా శాంసంగ్ ఆలస్యం చేస్తుందా? అన్న సందేహాలు యూజర్లలో ఉన్నాయి. ముఖ్యంగా One UI 8 అప్‌డేట్‌ను అందడంలోనూ ఆలస్యం జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వన్ UI 7ను విడుదల చేయడానికి తీసుకున్న సమయం కంటే చాలా వేగంగా వన్ UI 8ను విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తున్నట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు ఏడాది చివరలో విడుదల కానున్నాయి. లాంచింగ్ సమయంలోనే అవి వన్ UI 8, ఆండ్రాయిడ్ 16 బిల్టిన్‌తో రావచ్చని తెలుస్తోంది.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7లోనూ..
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఈ ఏడాది జులైలో విడుదల కానున్నాయి. వాటిలో One UI 8ను ఇన్‌స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వాటిని కొన్నవారు మళ్లీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి ఆండ్రాయిడ్ 16 బిల్టిన్‌తోనూ వస్తున్నాయి. దీంతో కొత్తలుక్, మెరుగైన పెర్ఫార్మన్స్, స్మార్టర్ నోటిఫికేషన్స్ వంటి వాటిని ఈ కొత్త ఫోన్లలో చూడొచ్చు.
శాంసంగ్ నిజంగా Z ఫ్లిప్ 7, Z ఫోల్డ్ 7 వంటి కొత్త ఫోన్‌లను వన్ UI 8తో విడుదల చేస్తే పాత ఫోన్‌లు (గెలాక్సీ S25 వంటివి) కూడా వన్ UI 8 అప్‌డేట్‌ను అందుకుంటాయి. అంటే ఆ స్మార్ట్‌ఫోన్లకు UI 7 అప్‌డేట్ అందడానికి పట్టినంత సమయం వన్ UI 8 అందడానికి పట్టదు.