India : మహిళలకు శుభవార్త, తక్కువ ధరకే వాషింగ్ మెషిన్లు
.తక్కువ ధరలో ఉన్న వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఓ ఇంజినీర్ ప్రయత్నిస్తున్నారు.

Washing
Sikh engineer: ఇంటి పని, బయట పనితో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. సామాన్య, మధ్య తరగతి వాసుల ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. ఇందులో బట్టల ఉతకడం. ప్రతింట్లో ఎక్కువ మంది ఉంటే..వారి బట్టలు ఉతకడం మహిళలకు కొంచెం కష్టమైన పని. కొద్దిగా డబ్బున్న వారు వాషింగ్ మెషిన్లు కొని..వారి సమస్యను కొద్దిగా దూరం చేస్తుంటారు. అయితే..సామాన్య, మధ్య తరగతి వారిలో కొంతమంది వాషింగ్ మెషిన్లు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. వీరి సమస్యను పరిష్కరించేందుకు..తక్కువ ధరలో ఉన్న వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఓ ఇంజినీర్ ప్రయత్నిస్తున్నారు. దిగువ, మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకుని…వీటిని అందుబాటులోకి తీసుకరానున్నారు.
నవజ్యోత్ సాహ్నీ..లండన్ లో జన్మించారు. ఇతను భారతీయ విద్యార్థి. మూడేళ్ల క్రితం తక్కువ ఆదాయ వర్గాలకు వాషింగ్ మెషిన్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని స్వచ్చంద సేవకులు, భాగస్వాములతో కలిసి ఇరాక్ లోని రెప్యూజీ క్యాంప్ లో ఏర్పాటు చేయనున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు నవ్ జ్యోత్ ఒకరోజు తన స్నేహితురాలు దివ్యను కలవడానికి తనింటికి వెళ్లాడు. అక్కడ తను ఇంటి పనులు చేస్తుంటే చలించిపోయాడు. ఆమె బట్టలు ఉతుకుతున్న తీరును చూసి..ఇంట్లో పనిభారం ఎక్కువగా ఉన్న వారికి ఏదైనా చేయాలని అనుకున్నాడు. తక్కువ ధర ఉన్న వాషింగ్ మెషిన్ ను అందించాలని ఐడియాతో సరఫరా చేయనున్నారు.
Read More : Mouni Roy: బికినీలో మౌనీ రాయ్ ఫోజులు.. కిల్లర్ లుక్.. అందమైన ఫోటోలు
ఆఫ్ లోడ్, మాన్యువల్ వాషింగ్ మెషిన్ ప్రాజెక్టు ద్వారా 60-70 శాతం సమయం ఆదా చేసుకొనే వీలుంటుంది. 50 శాతం నీటిని కూడా సేవ్ చేసేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు. వంటగదిలో సాధారణంగా ఉపయోగించే స్పిన్నర్ ను స్పూర్తిగా తీసుకున్నాడు. తన స్నేహితురాలు పేరు మీదనే దివ్య 1.5 మోడల్ తో మొదటి దానిని రూపొందించారు. ఇరాక్ లోని మమ్రాషన్ శరణార్థుల శిబిరంలో స్వచ్చంద సంస్థ కేర్ ఇంటర్నేషనల్ సహాయంతో 30 వాషింగ్ మెషిన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాల పంపిణీకి నవజ్యోత్ సెప్టెంబర్ లో ఇరాక్ వెళ్లాలని యోచిస్తున్నారు. ఏడాది అనంతరం వీటిని జోర్దాన్ క్యాంప్ లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వతే ఇండియా, ఆఫ్రికా దేశాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.