ఎలక్ట్రిక్ సన్ రూఫ్‌తో Tata Nexon కొత్త కారు.. రేటు రిజనబుల్!

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి కొత్త వేరియంట్ కారు భారత మార్కెట్లోకి వచ్చింది.. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ SUV వేరియంట్లలో Nexon కొత్త XM (S) కారు అధికారికంగా టాటా కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో వస్తోంది.. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీని ప్రారంభ ధర రూ. 8.36 లక్షలుగా ఉంది. ఈ సిగ్మంట్ లో సరసమైన ధరకే కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
XM (S) కారు వేరియంట్లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను రెండు ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో ఆఫర్ చేస్తోంది. ఇందులో మ్యానువల్, రెండోది AMT. అయితే XMA(S) AMT వేరియంట్ కారు డీజిల్ ఇంజిన్‌తో (ఎక్స్ షోరూం ఢిల్లీ) ధర రూ.10.30 లక్షలు ఉంటుంది. గతంలో ఇదే ఫీచర్ కారు వేరియంట్లలో XZ+ (S), XZA+ (S) కార్లను టాటా మోటార్స్ ఆఫర్ చేసింది.
ఈ కొత్త XM(S) టాటా నెక్సాన్ కారులో ఎలక్ట్రిక్ సర్ రూఫ్ మాత్రమే కాదు.. ఎన్నో ఫీచర్లను కలిగి ఉంది.. ఆటోమాటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రొగ్రామ్ తోపాటు ఎల్ ఈడీ DRLs ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, హర్మాన్ రూపొందించిన కనెక్ట్ నెక్స్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ డ్రైవ్ మోడ్స్ మరెన్నో ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.
ఈ కొత్త నెక్సాన్ SUVలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ BS6 కంప్లయింట్ 1.2 లీటర్ టర్బోచార్జడ్ రెవోట్రాన్ యూనిట్ ఉంది. అలాగే డీజిల్ ఇంజిన్ లోనూ Bs6 కంప్లయింట్ 1.5 లీటర్ టర్బో ఛార్జడ్ రెవోట్రోక్ ఇంజిన్ ఉంది. అలాగే 118bhp, 170Nm టర్క్యూ కూడా ఉంది. పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మ్యానువల్, ఆప్షనల్ 6 స్పీడ్ AMTతో రన్ అవుతాయి.
Nexon XM(S) వేరియంట్ కార్లు :
* XM(S) Manual : రూ. 8.36 లక్షలు( పెట్రోల్) రూ. 9.70 లక్షలు (డీజిల్)
* XMA(S) AMT : రూ. 8.96 లక్షలు( పెట్రోల్) రూ. 10.30 లక్షలు (డీజిల్)