Nearby Share App : విండోస్ నుంచి ఆండ్రాయిడ్‌కు ఫైల్స్ పంపడం ఎలా? ఈ యాప్ ఉంటే చాలు.. ఈజీగా షేర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Nearby Share App : విండోస్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫైల్స్ ఎలా షేర్ చేయాలో తెలుసా? గూగుల్ (Google) ఆధారిత డెస్క్‌టాప్ యాప్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ (Nearby Share) అనే యాప్ ద్వారా ఈజీగా ఫైల్స్ పంపుకోవచ్చు.

Nearby Share App : విండోస్ నుంచి ఆండ్రాయిడ్‌కు ఫైల్స్ పంపడం ఎలా? ఈ యాప్ ఉంటే చాలు.. ఈజీగా షేర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Tech Tips in Telugu (Photo : Google)

Updated On : April 5, 2023 / 8:18 PM IST

Nearby Share App : సాధారణంగా ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు ఏదైనా డేటా మూవ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగించి విండోస్ (Windows) నుంచి ఆండ్రాయిడ్ (Android) డివైజ్‌లకు చాలా సులభంగా ఫైల్స్ పంపుకోవచ్చు. దీనికి సంబంధించి గూగుల్ (Google 2020)లో ఒక అద్భుతమైన ఫీచర్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అది బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు (Android) ఫోన్‌లు, టాబ్లెట్‌ (Tablets), (Chromebook)లలో ఫొటోలు, వీడియోలు, ఇతర మీడియాను త్వరగా పంపుకోవచ్చు. లేదంటే తిరిగి డివైజ్‌లోకి పొందవచ్చు. ఇప్పుడు, మొబైల్, డెస్క్‌టాప్‌లో షేరింగ్ ఈజీగా ఉండేందుకు గూగుల్ ఇటీవల (Apple AirDrop) ఆధారిత (Nearby Share)ని విండోస్ పీసీ (Windows PC)లకు విస్తరించింది.

ప్రత్యేకించి.. వైర్‌లెస్ షేరింగ్ కోసం గూగుల్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను తీసుకొచ్చింది. విండోస్ PCలు, ఆండ్రాయిడ్ డివైజ్‌ల మధ్య ఫైల్‌లను సులభంగా షేర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఈ కొత్త డెస్క్‌టాప్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్, విండోస్ కంప్యూటర్ యూజర్లు వైర్‌లెస్‌గా ఫైల్‌లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. గూగుల్, మైక్రోసాఫ్ట్ పర్యావరణ వ్యవస్థలను మరింత పటిష్టంగా నిర్మించేందుకు ఈ యాప్ మరింత అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా, గూగుల్ ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతాలలో మాత్రమే బీటా వెర్షన్‌గా (Windows) యూజర్ల కోసం (Nearby Share)ని రిలీజ్ చేస్తోంది. రాబోయే వారాల్లో ఈ యాప్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీ (Windows PC)లో Nearby Shareని ఎలా యాడ్ చేయాలి? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

Windows యూజర్లు Nearby Share బీటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే? :
– ముందుగా.. మీ PCలో ఈ లింక్‌ (android.com/better-together/nearby-share-app) ద్వారా క్లిక్ చేయండి.
– ‘Get started with Beta’పై Click చేయండి.
.exe ఫైల్‌ను Download చేయండి.
– డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు (File)ను ఓపెన్ చేయండి.
– ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మీ Google అకౌంట్లో సైన్ ఇన్ (Sign-In) చేయండి.

Tech Tips in Telugu _ How to transfer files from Windows to Android using Google Nearby Share

Nearby Share App (Photo : Google)

Note : ఈ గూగుల్ యాప్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే ఉంది. ప్రస్తుతం ఫైల్ ఈ లింక్ ద్వారా అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రోమ్ స్టోర్‌ (Chrome Store)లో అందుబాటులో ఉంటుంది.

Read Also : Tech Tips in Telugu : పేటీఎం, పోన్‌పే వ్యాలెట్ నుంచి నగదును బ్యాంకు అకౌంట్లకు ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!

Windows యూజర్లు (Nearby Share) యాప్ ఎలా సెటప్ చేయాలంటే? :
– అదే App ఓపెన్ చేయండి.
– Set Up పేజీకి వెళ్లండి.
– మీ కంప్యూటర్‌లో Name ఎంచుకోండి.
– ‘Receiving’ సెక్షన్‌లో మీతో ఎవరు Share చేయవచ్చో ఎంచుకోండి.
– మీరు ప్రతి ఒక్కరి తెలిసిన కాంటాక్టుల నుంచి మీ డివైజ్‌ల నుండి మాత్రమే స్వీకరించేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు లేదా ఎవరూ (No One) కూడా ఎంచుకోవచ్చు.
– సెటప్‌ను పూర్తి చేసేందుకు ‘Done’ క్లిక్ చేయండి.

Nearby Share ఉపయోగించి Windows నుంచి Androidకి ఫైల్‌ను ఎలా షేర్ చేయాలంటే? :

– ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత.. మీ Windows డివైజ్ మీ Android డివైజ్‌లతో Pair చేసేందుకు రెడీగా ఉంటుంది.
– మీరు ఆండ్రాయిడ్‌లోని షేర్ మెను (Share Menu) ద్వారా లేదా విండోస్‌లో డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం ద్వారా ఫైల్‌లను Share చేయవచ్చు.
– ఫైల్‌ను పంపడానికి (Recipient) ఎంచుకోండి.
– Recipient తప్పనిసరిగా ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు (Accept) చేయాలి.
– మీరు మీకే పంపితే.. ఫైల్ ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
– మీరు Nearby Share బీటాను ఉపయోగించి మీ Android డివైజ్‌కు ఫొటోలు, స్క్రీన్‌షాట్‌లు, వీడియోలు, డాక్యుమెంట్లను పంపవచ్చు.

Tech Tips in Telugu _ How to transfer files from Windows to Android using Google Nearby Share

Nearby Share App (Photo : Google)

అదే సమయంలో, రెండు డివైజ్‌లు మీ Google అకౌంట్లలో లాగిన్ అయినట్లయితే.. ఫైల్ షేరింగ్ ఆటోమాటిక్‌గా కనెక్ట్ అవుతుంది. Android నుంచి PCకి షేర్ చేసేందుకు మీ PCలో Nearby Share బీటా యాప్ రన్ అవుతుందని నిర్ధారించుకోండి. అందుబాటులో ఉన్న డివైజ్ లిస్టు నుంచి PCని ఎంచుకోండి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లతో షేర్ చేయడానికి ఈ బీటా యాప్ సపోర్టు ఇస్తుంది.

విండోస్ PCల కోసం Nearby Share బీటా యాప్ వినియోగించాలంటే.. ప్రస్తుతం, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెకియా, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సీ , మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ వంటి దేశాల్లో సపోర్టు లేదని గమనించాలి.

Read Also : Fake Websites Scam : ఆన్‌లైన్ స్కామర్లతో జాగ్రత్త.. డిమార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ పేర్లతో ఫేక్ వెబ్‌సైట్లు.. ఈ లింకులను క్లిక్ చేస్తే ఖతమే..!