Top Bikes in India: ఇండియాలో రూ.3 లక్షల లోపు టాప్ బైక్ లు ఇవే
2021లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారత్ లో భేష్ అనిపించాయి. చిన్న బైక్ లతో పాటు రేటు ఎక్కువున్న బైక్ లు సైతం ఈఏడాది గణనీయమైన అమ్మకాలు అందుకున్నాయి.

Bikes
Top Bikes in India: అన్ని దేశాల్లో పరిస్థితి ఎలా ఉన్నా, భారత్ వాహనరంగంలో మాత్రం.. పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వాహన తయారీ సంస్థలు ధైర్యంగానే తమ ఉత్పత్తులను భారత విఫణిలోకి ప్రవేశపెట్టాయి. వారు అనుకున్నట్టుగానే వాహన అమ్మకాలు కూడా వృద్ధి రేటును కనబరిచాయి. ముఖ్యంగా 2021లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారత్ లో భేష్ అనిపించాయి. చిన్న బైక్ లతో పాటు రేటు ఎక్కువున్న బైక్ లు సైతం ఈఏడాది గణనీయమైన అమ్మకాలు అందుకున్నాయి. 2021లో ఇండియాలో వచ్చిన రూ.3 లక్షల లోపు టాప్ బైక్ లు ఏమిటో చూద్దాం.
1. రాయల్ ఎన్ఫీల్డ్ “హిమాలయన్”
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ భారతదేశంలో ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఇండియాలో ఈ బైక్ ప్రారంభ ధర రూ 2.10 లక్షలుగా ఉండగా టాప్ వేరియంట్ ధర రూ. 2.17 లక్షలుగా ఉంది. 3 వేరియంట్లు, 9 రంగులలో ఈ హిమాలయన్ బైక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. 411CC BS6 ఇంజిన్ కలిగిన ఈ బైక్ 24.3 bhp పవర్ ను మరియు 32 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్ (ఏబీఎస్)తో, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న అడ్వెంచర్ బైక్.
2. హోండా “CB350 RS”
జపాన్ వాహన దిగ్గజం హోండా సంస్థ, ఇండియాలో తన మోటార్ సైకిల్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళికతో ఉంది. అందులో భాగంగా పెద్ద ద్విచక్ర వాహనాలను అమ్మెందుకు “big wing”ను ఏర్పాటు చేసింది. ఇందులో మొదటగా వచ్చిన హోండా H,ness 350ని కొంచెం స్పార్టీగా డిజైన్ చేసి హోండా “CB350 RS”గా తీసుకొచ్చింది హోండా. ఇప్పుడిప్పుడే అమ్మకాల సంఖ్యను పెంచుకుంటున్న”CB350 RS” ధర రూ. 2.01 లక్షలుగా ఉంది. 350CC ఇంజిన్ కెపాసిటీ కలిగిన ఈ బైక్, 20.78 bhp పవర్, 30Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
3. బెనెల్లీ TRK 251
ఇటలీకి చెందిన బెనెల్లీ ఇటీవల భారతదేశంలో TRK 251 అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసింది. ఈ TRK 251 ప్రారంభ ధర రూ. 2.51 లక్షలు. సింగల్ వేరియంట్ మరియు 3 రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది. 249cc BS6 ఇంజిన్‌తో వస్తున్న ఈ బెనెల్లీ TRK 251 బైక్, 25.47 bhp పవర్ మరియు 21.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక (Dual Chanel ABS)డిస్క్ బ్రేక్‌లతో వస్తున్న ఈ TRK 251 బైక్ బరువు 164 కిలోలు మరియు 18 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది.
Also Read: Best Software Jobs: 2022లో అత్యధిక జీతం అందించే “టెక్ ఉద్యోగాలు” ఇవే
4. KTM 250 డ్యూక్
ఆస్ట్రియన్ సూపర్ బైక్ KTM, దశాబ్ద కాలంగా భారత్ విఫణిలో కొనసాగుతుంది. సూపర్ బైక్ లలో KTM ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది. ఇందులో 125, 200, 250, 390 బైకులు అందుబాటులో ఉన్నాయి. 200 డ్యూక్ తక్కువ మరియు 390 డ్యూక్ కొంచెం ఎక్కువ అని భావించే వారికి సరైన స్వీట్ స్పాట్‌గా KTM 250 డ్యూక్ సరిపోతుంది. మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 2.28 లక్షలుగా ఉంది. సింగల్ వేరియంట్, 2 రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది. 248.8-cc BS6 ఇంజిన్‌తో వస్తున్న KTM 250 డ్యూక్, 29.6 bhp పవర్ ను, 24 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు మరియు వెనుక రెండు డిస్క్ బ్రేక్(Dual Chanel ABS)లతో, వస్తున్న ఈ 250 డ్యూక్ బైక్ బరువు 169 కిలోలు మరియు 13.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది.
5. జావా పెరాక్
జావా పెరాక్ అనేది సింగిల్-సీటర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. దేశీయ వాహన దిగ్గజం మహీంద్రాతో కలిసి ఈ జావా మోటార్ సైకిల్స్ భారత్ లో తయారు చేస్తున్నారు. జావా పెరాక్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.2.08 లక్షలు. ఇది కేవలం ఒకే ఒక్క వేరియంట్, ఒక్క రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. 334cc BS6 ఇంజిన్‌తో వస్తున్న జావా పెరాక్ 30 bhp పవర్ ను, 32.74 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో, జావా పెరాక్ ABSతో వస్తుంది. ఈ పెరాక్ బైక్ బరువు 175 కిలోలు మరియు 14 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది.
ఇవి 2021లో ఇండియాలో విడుదలై మంచి అమ్మకాలు నమోదు చేస్తున్న రూ.3 లక్షల లోపు టాప్ బైక్స్.
Also Read: Solar Power: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఐఐటీ గుహాటీ కీలక పరిశోధన