Vivo V27 Series Launch : వివో నుంచి అత్యంత ఖరీదైన V27 సిరీస్ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Vivo V27 Series Launch : వివో (Vivo) నుంచి అత్యంత ఖరీదైన V సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో Vivo V27 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. వివో V27 ఫోన్ లాంచ్‌కు సంబంధించిన టీజర్‌ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో వెల్లడించింది.

Vivo V27 Series launching in India soon, V27 Pro could be most expensive V series phone
Vivo V27 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి అత్యంత ఖరీదైన V సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో Vivo V27 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. వివో V27 ఫోన్ లాంచ్‌కు సంబంధించిన టీజర్‌ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో వెల్లడించింది. Vivo V27 Pro వెర్షన్ అనే రెండు మోడళ్లను లాంచ్ చేయనుంది. ఈ 5G ఫోన్ ఫీచర్లతో రానుంది. అయితే, వివో కొత్త ఫోన్ అధికారిక లాంచ్ ఈవెంట్‌కు ముందు కొన్ని ఫీచర్లను కూడా ధృవీకరించింది. టిప్‌స్టర్ Vivo V27 ప్రో ధరను కూడా లీక్ చేసింది. ఇప్పటివరకు అత్యంత ఖరీదైన V సిరీస్ ఫోన్ అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Vivo V27 Series launching in India soon, V27 Pro
Vivo C27 సిరీస్ డిజైన్ మాదిరిగానే కొత్త మోడల్‌లు ఉంటాయని అంచనా. 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెన్సార్‌లు కొద్దిగా దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌పై ఉండనున్నాయి. స్లిమ్, తేలికైన డిజైన్‌ను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. పంచ్-హోల్ డిజైన్‌తో ముందు భాగంలో కర్వడ్ డిస్‌ప్లే ఉండొచ్చు. కెమెరా ఇప్పటికే Vivo ఫోన్‌ల కీలకమైన ఫోకస్ ఫీచర్లలో ఒకటిగా ఉంది. కొత్త Vivo V27 సిరీస్ భిన్నంగా ఉండకపోవచ్చు.
ఈ డివైజ్ బెస్ట్ పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తాయని చెప్పవచ్చు. మిగిలిన వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. సాధారణ మోడల్ ధర ఎంత అనేది తెలియదు. కానీ, PriceBaba.com నివేదిక ప్రకారం.. Vivo V27 Pro మోడల్ ధర రూ. 42వేలుగా ఉంటుంది. కానీ, లాంచ్ ధర ఒకే విధంగా ఉండదు. కంపెనీ కొత్త Vivo ఫోన్ ధరను రూ. 40వేల లోపు ఉంటుందని చెప్పవచ్చు. Vivo V25 Pro ప్రారంభ ధర రూ. 35,999తో అందుబాటులోకి వచ్చింది. ముందున్న ధర మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Vivo V27 Series launching in India soon, V27 Pro
Vivo V27 Pro సిరీస్ అత్యంత ఖరీదైన V సిరీస్ ఫోన్‌గా భారత మార్కెట్లోకి రానుంది. భారత్‌లో సాధారణ Vivo V27 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేసినట్లయితే.. Vivo V సిరీస్ ఫోన్‌లలో మునుపటి లాంచ్‌లను పరిశీలిస్తే.. ధర రూ. 30వేల లోపు ఉంటుంది. Vivo V25 భారత మార్కెట్లో రూ. 27,999కి లాంచ్ కానుంది. కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. ఇప్పుడు లాంచ్‌కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. వివో త్వరలో కొత్త ఫోన్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. Vivo V27 సిరీస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.