Vivo X90 Pro Price Cut : కొంటే ఈ ఫోన్ కొనాల్సిందే.. వివో X90 ప్రో ధర భారీగా తగ్గింపు.. మరెన్నో డిస్కౌంట్లు..!

Vivo X90 Pro Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ (Vivo X90 Pro) ధరను రూ. 10వేలు తగ్గించింది. మరెన్నో ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

Vivo X90 Pro Price Cut : కొంటే ఈ ఫోన్ కొనాల్సిందే.. వివో X90 ప్రో ధర భారీగా తగ్గింపు.. మరెన్నో డిస్కౌంట్లు..!

Vivo X90 Pro Price Cut In India On Flagship Phone Check Offers

Updated On : October 21, 2023 / 4:17 PM IST

Vivo X90 Pro Price Cut : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో (Vivo) కొన్ని నెలల క్రితమే వివో X90 సిరీస్‌ (Vivo X90 Series)ను లాంచ్ చేసింది. వివో (X90 Pro) ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారులకు ఇదే సరైన అవకాశం. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధరను కంపెనీ ఏకంగా రూ.10వేలు తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. మీరు అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లను ఓసారి చెక్ చేసుకోండి.

భారత మార్కెట్లో వివో X90 ప్రో 12GB RAM, 256GB స్టోరేజ్‌తో (Flipkart), (Vivo) అధికారిక ఛానల్‌లు, ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో రూ. 74,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. వివో సింగిల్ లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ ప్రో ఫోన్ కొనుగోలుపై నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also :  Vivo V29 Series Launch : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. వివో V29 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!

అంతేకాకుండా, బ్రాండ్ నిబంధనలకు లోబడి స్మార్ట్‌ఫోన్‌తో రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉందని వివో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్రీ ఫెస్టివల్ బాక్స్ ప్యాకేజింగ్, ఫ్రీ గోవా టిక్కెట్‌లను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.

Vivo X90 Pro Price Cut In India On Flagship Phone Check Offers

Vivo X90 Pro Price Cut In India

వివో X90 ప్రో స్పెసిఫికేషన్‌లు :
వివో X90 ప్రో మోడల్ 6.78-అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఎండ్ కలిగి ఉంది. హుడ్ కింద, డివైజ్ Immortalis-G715 గ్రాఫిక్స్‌తో 4nm డైమెన్సిటీ 9200 చిప్‌ను పొందుతుంది. Android 13 ఆధారంగా Funtouch OS 13పై రన్ అవుతుంది. వివో X90 ప్రో మోడల్ 120W FlashCharge వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే.. హ్యాండ్‌సెట్ 50MP (1-అంగుళాల IMX989) OIS, 12MP అల్ట్రావైడ్ (IMX663), 50MP పోర్ట్రెయిట్ OIS (IMX758) బ్యాక్ లెన్స్‌ను పొందుతుంది. సెల్ఫీల కోసంఫ్లాగ్‌షిప్ 32MP సెన్సార్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ డివైజ్ Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్‌ను అందిస్తుంది. సురక్షిత అథెంటికేషన్ కోసం X90 ప్రో డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంది.

Read Also : Vi Navratri Offers 2023 : వోడాఫోన్ ఐడియా ‘నవరాత్రి’ ఆఫర్లు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు డేటా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్ర్కిప్షన్..!