Redmi Phones Launch : భారత్‌కు రానున్న కొత్త రెడ్‌మి 5జీ ఫోన్లు.. ఈ నెలలో రెడ్‌మి A4 5జీ ఫోన్, డిసెంబర్‌లో రెడ్‌మి నోట్ 14 సిరీస్!

Redmi Phones Launch : భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి ద్వారా దేశంలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.

Redmi Phones Launch : భారత్‌కు రానున్న కొత్త రెడ్‌మి 5జీ ఫోన్లు.. ఈ నెలలో రెడ్‌మి A4 5జీ ఫోన్, డిసెంబర్‌లో రెడ్‌మి నోట్ 14 సిరీస్!

Xiaomi India to Launch Redmi A4 5G in November

Updated On : November 6, 2024 / 10:39 PM IST

Redmi Phones Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి ద్వారా దేశంలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ ఇటీవలే రాబోయే రెడ్‌మి A4 5Gని లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో కంపెనీ నెక్స్ట్ ఎంట్రీ-లెవల్ 5జీ హ్యాండ్‌సెట్‌గా అంచనా. ఈ 5జీ ఫోన్ ధర రూ. 10వేల లోపు ధరలో ఉండవచ్చు. రాబోయే నెలల్లో దేశంలో రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల అప్‌గ్రేడ్ వెర్షన్లను కూడా లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు క్యూ1 2025 వరకు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదు.

రెడ్‌మి A4 5జీ, రెడ్‌మి నోట్ 14 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ :
బిజినెస్ వరల్డ్ నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ నెలలో భారత మార్కెట్లో రెడ్‌మి A4 5జీ లాంచ్ చేయాలని యోచిస్తోంది. కంపెనీ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను గత నెలలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2024)లో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు, స్పెసిఫికేషన్‌లు, ధర, లభ్యత వంటివి దేశంలోకి రాకముందే కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో రెడ్‌మి A4 5జీని లాంచ్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ తయారీదారు దేశంలో రెడ్‌మి నోట్ 14 సిరీస్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు షావోమీ సీఎంఓ అనుజ్ శర్మ తెలిపారు. షావోమీ అనుబంధ సంస్థ ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేయడం 2022 తర్వాత ఇదే మొదటిసారి. కంపెనీ తన ‘డ్యూయల్-లాంచ్ విధానం’కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉందని ఎగ్జిక్యూటివ్ చెప్పారు. నివేదిక ప్రకారం.. షావోమీ 15 సిరీస్ మార్చి 2025 వరకు వచ్చే అవకాశం లేదు.

రెడ్‌మి A4 5జీ, రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
రెడ్‌మి నోట్ 14 సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో అమర్చి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్, రెడ్‌మి నోట్ 14ప్రో వరుసగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 డైమన్షిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్‌ల ద్వారా పవర్ పొందుతున్నాయి. రెడ్‌మి నోట్ 14ప్రో మోడల్స్ రెండూ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 50ఎంపీ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఇతర మోడల్ 2ఎంపీ మాక్రో కెమెరాను కలిగి ఉంది. రెడ్‌మి ప్రో+ మోడల్‌లో 6,200mAh బ్యాటరీ ఉంది. 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే, రెడ్‌మి ప్రో మోడల్‌లో 5,500mAh బ్యాటరీ 44డబ్ల్యూ వద్ద ఛార్జ్ అవుతుంది.

మరోవైపు, రెడ్‌మి ఎ4 5జీని ఐఎమ్‌సీ 2024లో ఆవిష్కరించిన వారాల తర్వాత కంపెనీ ఇంకా భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 50ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా. రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : US President Salary : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఏడాదికి ఎంత జీతమో తెలుసా? ఎలాంటి ప్రొత్సాహకాలు అందుతాయంటే?