Xiaomi Pad 7 Launch : ఏఐ ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 వచ్చేసింది.. భారీ ఎల్‌సీడీ స్ర్కీన్, మరెన్నో ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi Pad 7 Launch : భారత మార్కెట్లో షావోమీ ప్యాడ్ 7 ఫోన్ 8జీబీ+ 128జీబీ, 12జీబీ + 256జీబీ ఆప్షన్లు వరుసగా ధర రూ. 27,999, రూ. 30,999కు పొందవచ్చు.

Xiaomi Pad 7 Launch : ఏఐ ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 వచ్చేసింది.. భారీ ఎల్‌సీడీ స్ర్కీన్, మరెన్నో ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi Pad 7 Launch

Updated On : January 10, 2025 / 10:45 PM IST

Xiaomi Pad 7 Launch : కొత్త ప్యాడ్ కొంటున్నారా? షియోమి ప్యాడ్ 7 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌సెట్, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,850mAh బ్యాటరీ కలిగి ఉంది. 11.2-అంగుళాల 3.2కె ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 15-ఆధారిత హైపర్ఓఎస్ 2.0తో వస్తుంది. టాబ్లెట్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఏఐ రైటింగ్, ఏఐ లైవ్ సబ్‌టైటిల్స్ వంటి అనేక ఏఐ-సపోర్టు గల ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ప్యాడ్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. ఈ నెలాఖరులో దేశంలో విక్రయానికి రానుంది.

Read Also : UPI Payments : యూపీఐ వాడుతున్నారా? ఇంటర్నెట్ లేకుండా పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

భారత్‌లో షావోమీ ప్యాడ్ 7 ధర, లభ్యత :
భారత మార్కెట్లో షావోమీ ప్యాడ్ 7 ఫోన్ 8జీబీ+ 128జీబీ, 12జీబీ + 256జీబీ ఆప్షన్లు వరుసగా ధర రూ. 27,999, రూ. 30,999కు పొందవచ్చు. హై-వేరియంట్ నానో టెక్చర్ డిస్‌ప్లే ఎడిషన్‌ రూ. 32,999కు అందిస్తుంది. గ్రాఫైట్ గ్రే, మిరాజ్ పర్పుల్, సేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ టాబ్లెట్ దేశంలో అమెజాన్, షావోమీ ఇండియా ఇ-స్టోర్, షావోమీ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో జనవరి 13 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌లు రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు.

షావోమీ ప్యాడ్ 7 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
షావోమీ ప్యాడ్ 7 ఫోన్ 11.2-అంగుళాల 3.2కె (3,200 x 2,136 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 360Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయి, అలాగే డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే రైన్‌ల్యాండ్ ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

Xiaomi Pad 7 Launch

Xiaomi Pad 7 Launch

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. టాబ్లెట్ క్వాల్‌‍కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్ ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది.

మీరు షావోమీ ప్యాడ్ 7లో 13ఎంపీ బ్యాక్ కెమెరాను పొందుతారు. అయితే, టాబ్లెట్ 8ఎంపీ అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. క్వాడ్-మైక్ సెటప్, డాల్బీ అట్మోస్‌తో కూడిన క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

షావోమీ ప్యాడ్ 7 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,850mAh బ్యాటరీని అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ 3.2 టైప్-సి జనరేషన్ 1 పోర్ట్ ఉన్నాయి. ఇన్‌ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్‌తో అమర్చి ఉంటుంది. టాబ్లెట్ పరిమాణం 251.22×173.42×6.18ఎమ్ఎమ్, 500 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Amazon Republic Day Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 13 నుంచే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!