బంపరాఫర్ : MI ఫోన్లపై భారీ తగ్గింపులు

  • Published By: venkaiahnaidu ,Published On : January 11, 2019 / 09:25 AM IST
బంపరాఫర్ : MI ఫోన్లపై భారీ తగ్గింపులు

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి తన లేటెస్ట్   స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 6ప్రో ని అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.  15వేల రూపాయలుగా ఉన్న నోట్ 6 ప్రొ  స్మార్ట్ ఫోన్ ని ఫ్లిఫ్ కార్డులో  కేవలం 2వేల 799 రూపాయలకే అందించనున్నట్లు ఎమ్ఐ ఇండియా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్ గా ఈ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే ఫ్లిఫ్ కార్డులో మాత్రం వెబ్ సైట్ రెడ్ మీ నోట్ 6ప్రొ ధర రూ.13,999గానే కన్పిస్తుండటం విశేషం.

హై 5 పేరుతో స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్న ఫావోమి అయిదవ ఆఫర్ గా రెడ్ మీ 6 ధరను కూడా తగ్గించింది. భారత్ లో రెడ్ మీ 6స్మార్ట్ ఫోన్ పై 15వందలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లలోకి అడుగుపెట్టి 5ఏళ్లు అవుతున్న సందర్భంగా షావోమీ స్మార్ట్ ఫోన్ ధరలపై ఆఫర్లు ప్రకటించింది. భారత్ లో సావోమి సిరీస్ లో బాగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ గా రెడ్ మీ 6నిలిచింది. తగ్గిన ధరల ప్రాకరం 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వెర్షన్ రెడ్ మీ 6 ధర రూ. 7,999గా ఉండగా, 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వెర్షన్ రెడ్ మీ 6ధర రూ. 8,999కి గా అందుబాటులో ఉండనుంది.