Zomato Food Rescue Feature : జొమాటో కొత్త ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఇదిగో.. ఇకపై రద్దు చేసిన ఆర్డర్లపై డిస్కౌంట్ పొందవచ్చు!
Zomato Food Rescue Feature : జొమాటో వినియోగదారులు పరిమిత సమయం వరకు సమీపంలోని రెస్టారెంట్ల నుంచి ఇతర కస్టమర్లు రద్దు చేసిన ఫుడ్ ఆర్డర్లపై డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.

Zomato’s New Food Rescue Feature Lets Users Grab Cancelled Orders at a Discount
Zomato Food Rescue Feature : ప్రముఖ పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో భారతీయ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే.. ఫుడ్ రెస్క్యూ ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ రద్దు చేసిన ఆర్డర్ల వల్ల ఆహార వృథాను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జొమాటో వినియోగదారులు పరిమిత సమయం వరకు సమీపంలోని రెస్టారెంట్ల నుంచి ఇతర కస్టమర్లు రద్దు చేసిన ఫుడ్ ఆర్డర్లపై డిస్కౌంట్ ధరకు పొందవచ్చు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ తక్కువ సమయంలో తమ అన్టాంపర్డ్ ప్యాకేజింగ్‌లో ఆర్డర్లను స్వీకరిస్తుంది. అయితే, ఎంపిక చేసిన ఆహార పదార్థాలు మాత్రమే ఈ సర్వీసుకు వర్తిస్తాయని తెలిపింది. అలాగే, ఐస్‌క్రీమ్‌లు లేదా షేక్‌లు వంటివి క్యాన్సిలేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
జొమాటో ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఏంటి? :
ఇటీవల రద్దు చేసిన ఆర్డర్లు డెలివరీ పార్టనర్‌కు 3-కిలోమీటర్ల పరిధిలో యాప్‌లోని కస్టమర్లకు కనిపిస్తాయని జొమాటో బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. ఆర్డర్లు కొన్ని నిమిషాలు మాత్రమే క్లెయిమ్ చేసేందుకు అందుబాటులో ఉంటాయి. ఒరిజనల్ కస్టమర్లు, అలాగే వారికి సమీపంలో ఉన్నవారు తమ ఆర్డర్లను పొందలేరు. రద్దు చేసిన ఆర్డర్ కోసం పేమెంట్ ఇప్పటికే ఆన్లైన్లో చేసి ఉంటే.. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తం వారితో పాటు రెస్టారెంట్ పార్టనర్‌తో షేర్ అవుతుంది. జొమాటో ప్లాట్‌ఫారమ్ రుసుము నుంచి అవసరమైన ప్రభుత్వ పన్నులను మాత్రమే భరిస్తుందని పేర్కొంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ప్రకారం.. రెస్టారెంట్ భాగస్వాముల్లో 99.9 శాతం మంది ఈ ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌ను స్వాగతిస్తున్నారు. కస్టమర్ రద్దు చేసిన ఆర్డర్‌కు పరిహారం మాత్రమే కాకుండా, ఆ ఆర్డర్‌పై కస్టమర్ చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా, డెలివరీ పార్టనర్లు మొత్తం ట్రిప్‌కు పూర్తిగా పరిహారం చెల్లించడం జరుగుతుందని జొమాటో తెలిపింది.
ఈ ఫీచర్ ఫుడ్ ఆర్డర్ల దుర్వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఒరిజినల్ కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేయడానికి 100 శాతం అమౌంటుపై క్యాన్సిల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇందులో ఐస్ క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్, ఇతర పాడైపోయే వస్తువులకు ఇది రద్దు ఛార్జీలు వర్తించదని జొమాటో వెల్లడించింది. శాఖాహార ఆహారాన్ని ఇష్టపడే కస్టమర్లకు క్యాన్సిల్ చేసిన నాన్‌వెజ్ ఆర్డర్లు కూడా కనిపించవని కంపెనీ స్పష్టం చేసింది.