Hyderabad Lok Adalat : లోక్‌అదాలత్‌లో 1755 కేసుల పరిష్కారం
కోర్టు కేసుల పరిష్కారం కోసం శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో హైదరాబాద్ నగరంలోని వివిధ కోర్టుల పరిధిలో వివిధ కోర్టుల్లో 1755 కేసులు పరిష్కారమయ్యాయి.

Hyderabad Lok Adalat
Hyderabad Lok Adalat : కోర్టు కేసుల పరిష్కారం కోసం శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో హైదరాబాద్ నగరంలోని వివిధ కోర్టుల పరిధిలో వివిధ కోర్టుల్లో 1755 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు కృషి చేసిన ఆయా డివిజన్ల ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లను నగర సీఎం అంజనీకుమార్ అభినందించారు. వీరిలో ఇందులో ఏసీపీలు పి.నరేశ్‌రెడ్డి(బేగంపేట్), గణేశ్ (పంజాగుట్ట), భిక్షంరెడ్డి (ఇన్‌చార్జి, చార్మినార్), ఎన్.సుధీర్(గోపాలపురం), వేణుగోపాల్‌రెడ్డి(సైఫాబాద్), వెంకటరమణ(మలక్‌పేట్), స్టేషన్ హౌస్ అధికారులు ఇన్‌స్పెక్టర్లు కె.సైదులు(ఎస్‌ఆర్‌నగర్), సైదిరెడ్డి(సైఫాబాద్), జి.నరేశ్(చిలకలగూడ), పల్లె పద్మ(నార్త్‌జోన్ మహిళా పోలీస్‌స్టేషన్), జానకమ్మ(సౌత్‌జోన్ మహిళా పోలీస్‌స్టేషన్) ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీ శిఖాగోయెల్ పాల్గొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11తేదీన లోక్ అదాలత్ నిర్వహించగా 29 లక్షలకు పైగా కేసులు పరిష్కారం అయినట్లు సమాచారం.
చదవండి : Hyderabad Covid : కోవిడ్ టెస్టులు..ఇండియాలో హైదరాబాద్ థర్డ్ ప్లేస్