Tragedy : ప్రాణం తీసిన సెల్ఫీ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఓ యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం కోల్పోయాడు. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు.

Tragedy : ప్రాణం తీసిన సెల్ఫీ

Selfie Water

Updated On : September 6, 2021 / 10:18 AM IST

young man died : సెల్ఫీ కోసం ఎవరన్నా ప్రాణాలు తీసుకుంటారా? అంటే కొంతమంది మూర్ఖంగా అలానే చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టకుండా, పట్టించుకోకుండా సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఓ యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం కోల్పోయాడు. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు. కడపకు చెందిన రాజేష్ హైదరాబాద్‌లోని సురారంలో నివాసముంటున్నాడు. ఆదివారం బంధువులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.

మధ్యాహ్నం అనంతగిరిలో గడిపారు. ఆ తర్వాత లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. వారిలో నలుగురు ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్ళి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న జాలర్లు కాపాడే ప్రయత్నం చేశారు. ముగ్గురుని రక్షించారు. రాజేష్ మాత్రం నీటిలో మునిగి మృతి చెందాడు.

ఓ వైపు సెల్ఫీ మోజులో ప్రాణాలు పోతున్నా.. మరోవైపు కొందరు అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా.. సెల్ఫీ కోసం రిస్క్‌ చేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఇలానే మొన్న కొంతమంది సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

అంగడిపేట గ్రామంలో వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోతే.. అటుగా బైక్‌పై వచ్చిన కొందరు యువకులు వాగు మధ్యలోకి వెళ్లి సెల్ఫీలు దిగారు.