ACB Raids : ఇరిగేషన్ ఏఈ నిఖేశ్‌కు జ్యుడిషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకి తరలింపు..
నిఖేశ్ పేరిట 3 ఫామ్ హౌస్ లు, 3 విల్లాలు ఉన్నాయి.

ACB Raids : ఇరిగేషన్ ఏఈ నిఖేశ్ కుమార్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో ఏఈ నిఖేశ్ ను నిన్న రాత్రి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు.
నిన్న ఉదయమే గండిపేట మండలం పీరం చెరువు పెబల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన సమక్షంలోనే సోదాలు చేశారు. మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలం తోల్కత్తా, సజ్జన్ పల్లి, నక్కలపల్లి ఫామ్ హౌస్ లతో పాటు బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమాస్తుల పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
పదేళ్లు సర్వీస్ లో ఉన్న నిఖేశ్ 200 కోట్లకు పైగా అక్రమాస్తులను పోగేసినట్లుగా గుర్తించారు. గండిపేట బఫర్ జోన్ లో రూల్స్ కు విరుద్ధంగా పర్మిషన్స్ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన పోగేసిన ఆస్తుల చిట్టాను చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. నిఖేశ్ పేరిట 3 ఫామ్ హౌస్ లు, 3 విల్లాలు ఉన్నాయి. మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో తేలింది.
అక్రమాస్తుల కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టు ఏఈ నిఖేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న ఉదయం అసిస్టెంట్ ఇంజినీర్ నిఖేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు. ఆయన ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సోదాలు చేశారు అధికారులు.
రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు నిఖేశ్ కూడగట్టినట్లుగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మియాపూర్, శంషాబాద్, గండిపేట, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లతో పాటు ఇళ్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఆస్తుల పత్రాలను కూగా గుర్తించారు. పదేళ్ల సర్వీస్ లో రూ.200 కోట్లకుపైగా అక్రమార్జన చేయడంతో ఏసీబీ అధికారులే విస్తుపోయారు. నిఖేశ్ తో పాటు అతడి బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. బంధువుల ఇళ్లలో సుమారుగా కిలో బంగారంతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అంతులేని ఆస్తులు..
* ఇరిగేషన్ ఏఈ నిఖేశ్ కు జ్యుడిషియల్ రిమాండ్
* ఈ నెల 13వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
* చంచల్ గూడ జైలుకు నిఖేశ్ తరలింపు
* అక్రమాస్తుల కేసులో నికేశ్ కుమార్ అరెస్ట్
* నిన్న 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు
* రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు పోగేసినట్లు గుర్తింపు
* గండిపేట బఫర్ జోన్ లో రూల్స్ కు విరుద్ధంగా పర్మిషన్లు
* నిఖేశ్ పేరిట మూడు ఫామ్ హౌస్ లు, మూడు విల్లాలు
* మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లు
* మియాపూర్ లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తింపు
* 6 నెలల క్రితం లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన నిఖేశ్
Also Read : తెలంగాణ సీఎస్‌కు, పలువురు IASలకు మధ్య గ్యాప్..!