Adilabad Govt School Incident: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై విషప్రయోగం చేసింది వీడే.. ఎందుకలా చేశాడో తెలిసి పోలీసులే షాక్..
తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

Adilabad Govt School Incident: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురిలోని ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ధరంపురి గ్రామం గోండుగూడకు చెందిన సోయం కిష్టుగా గుర్తించారు పోలీసులు. అతడి నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. నిర్మల్ లోని తన సోదరుడి ఇంటి నుంచి సోయం కిష్టు పురుగుల మందు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలతో ప్రస్టేషన్ లో అతడీ దారుణానికి ఒడిగినట్లు తెలుస్తోంది. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో సోయం కిష్టుపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ధరంపురి ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం జరిగిన ఘటన సంచలనం రేపింది. అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మంచి నీటి ట్యాంకులో విషం కలిపినట్లుగా గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. అలాగే మధ్యాహ్న భోజన సామాగ్రిపైనా నిందితుడు పురుగుల మందు చల్లాడు. పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన హెడ్ మాస్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read : జైలు తప్పదు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్..
స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాను గుర్తించిన టీచర్లు విద్యార్థులు నీరు తాగకుండా ఆపేశారు. అలాగే మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. దీంతో పిల్లల తల్లిదండ్రుల ఊపిరిపీల్చుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. వాటర్ ట్యాంక్, మధ్యాహ్న భోజనం చేసే సామాగ్రిపై పురుగుల మందు చల్లాడు. టీచర్లు ముందే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. టీచర్లు గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యమైనా.. పిల్లలు స్కూల్ లో ఆ నీళ్లు తాగి ఉన్నా, మధ్యాహ్న భోజనం చేసినా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేందన్నారు. 30 మంది పిల్లలు కూడా చిన్న పిల్లలే. ప్రైమరీ స్కూల్ పిల్లలు.
Also Read: గ్రూప్-1 పరీక్షలో అతిపెద్ద కుంభకోణం జరిగింది, రద్దు చేయాలి- పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వంట మాస్టర్, హెడ్ మాస్టర్ చొరవతో పిల్లలు నీరు తాగకుండా, భోజనం చేయకుండా ఇంటికి పంపేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు మిస్టరీని చేధించారు. స్కూల్ సమీపంలో ఒక వ్యక్తి కొంత అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని విచారించగా తానే ఆ పని చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అంగీకరించాడు. కుటుంబకలహాలు, మానసిక పరిస్థితి బాగోలేక తానీ పని చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ రెండు రోజులుగా మూసి ఉంది. అయితే, కిచెన్ కు వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టిన నిందితుడు వంట సామాగ్రిపై పురుగుల మందు చల్లాడు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here