Kaleshwaram : కాళేశ్వరం మహా అద్భుతం.. అమెరికా సంస్థ ప్రశంసల వర్షం
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధులు అన్నారు.

Kaleshwaram project
Kaleshwaram Project : తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్(ASCE) ప్రశంసల జల్లు కురిపించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అంది. ఈ ప్రాజెక్ట్ నుండి ప్రపంచం ఎంతో నేర్చుకోవచ్చని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ మరియా సి లెమాన్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం గురించి వారు గొప్పగా మాట్లాడారు.
వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ 2023లో కీలకోపన్యాసం తర్వాత ASCE ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ చాట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వాసుల జీవన నాణ్యతను పెంచిందన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును ASCE ప్రతినిధి బృందం సందర్శించింది.
మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. నెవెడాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రీసోర్స్ కాంగ్రెస్‌లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ మంత్రి కేటీఆర్ ను అభినందిస్తూ ఒక జ్ఞాపికను బహూకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యుత్తమ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి తార్కాణంగా నిలిచిందని ఏఎస్‌సీఈ అధ్యక్షుడు మరియా లెమాన్ అన్నారు.
”తెలంగాణ ఆవిర్భావం ఎన్నో అంశాలతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు కళ్ల ముందు కనిపిస్తాయి. తెలంగాణలో ఇన్ని అద్భుతాలు సాధ్యమయ్యాయంటే దీని వెనకున్న నాయకుడి ఆలోచనలే. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్, మిషన్ భగీరథలు అత్యంత సమర్ధతతో, ఖర్చుతో కూడుకున్నవి. రికార్డు సమయంలో పూర్తి చేశాం” అని సభను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు.