Amit Shah : సమతామూర్తి.. భావి తరాలకు స్ఫూర్తి మంత్రం- అమిత్ షా
శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని చెప్పారు.

Amit Shah
Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో పంచెకట్టు, తిరునామంతో షా వచ్చారు. ఆశ్రమంలోని విశేషాలను చిన్నజీయర్ స్వామి అమిత్ షా కు వివరించారు. సమతామూర్తి విగ్రహాన్ని అమిత్ షా సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రవచన మండపంలో భక్తులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని చెప్పారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా అన్నారు. సనాతన ధర్మం అన్నింటికి మూలం అని, సమతా మూర్తి విగ్రహం.. ఏకతా సందేశాన్ని అందిస్తోందని అమిత్ షా వెల్లడించారు.
Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…
”సమానత్వ విగ్రహంను సందర్శించడం నా అదృష్టం. మనుషులంతా ఒక్కటే అన్న రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం. భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. సనాతన ధర్మం అన్నింటికీ మూలం. సమతామూర్తి రాబోయే తరాలవారికి స్ఫూర్తి మంత్రం. రామానుజాచార్య సమానత్వ సందేశాన్ని ఇచ్చారు. దేశాన్ని సమానత్వంతో అనుసంధానించారు. రామానుజాచార్యులు కుల వివక్షను అంతం చేసేందుకు కృషి చేశారు. స్వామీజీ కృషిని దేశం మొత్తం గుర్తుంచుకుంటుంది. సనాతన ధర్మంలో అహంకారం, జడత్వం లేదు. చిన జీయర్ స్వామికి దేశం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా” అని షా అన్నారు. సమతామూర్తి కేంద్రంలో 108 దివ్య క్షేత్రాలను అమిత్ షా దర్శించకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
”స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమ దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. రామానుజాచార్యుడు సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత నాలో చైతన్యం పెరిగింది. అనేక యుగాల వరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుంది. సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుంది. రామాయణ, భారత కాలాల నుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. సనాతన ధర్మం యాత్ర ఆగిపోదు.. ప్రపంచమంతా విస్తరిస్తుంది. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి నా అభినందనలు. నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాధు సంతవుల ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను ధిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు. రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్నిసూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడు బోధనలు చేశారు. రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయి. ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారు. వినమ్రత, సంస్కరణ కోసం చేసే విప్లవం ఇవి రెండూ కలిస్తేనే ఉద్దరణ ప్రక్రియ ఆవిష్కారమవుతుంది. దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విది విధానాలను నిర్దేశన చేశారు” అని అమిత్ షా అన్నారు.
Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!
ముచ్చింతల్ శ్రీరామ నగరంలో మూడున్నర గంటల పాటు గడిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు అమిత్ షా. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. సమతామూర్తి విగ్రహం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 3డీ లేజర్ షో చూశారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 7రోజు శ్రీరామనగరంలో రథ సప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణకై శ్రీనారసింహ ఇష్టి, జ్ఞాన జ్ఞానాకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి అంగరంగ వైభవంగా జరిగాయి.