Assailant Robbed Gold : కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి.. 14 తులాల బంగారం దోచుకెళ్లిన దుండగుడు
హైదరాబాద్ లో దోపిడీ ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కళ్లలో దుండగుడు కారం చల్లి కత్తితో పొడిచి 14 తులాల బంగారం దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

robbed gold
Assailant Robbed Gold : హైదరాబాద్ లో దోపిడీ ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కళ్లలో దుండగుడు కారం చల్లి కత్తితో పొడిచి 14 తులాల బంగారం దోచుకెళ్లాడు. సికింద్రాబాద్ లోని సిటీ లైట్ హోటల్ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పవన్ అనే వ్యక్తిపై దుండగుడు దాడి చేశాడు.
కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి అతని వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. హిమాయత్ నగర్ లోని రాధే జ్యూవెల్లర్స్ షాప్ లో బంగారం కొనుగోలు చేసి సికింద్రాబాద్ కు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సిటీ లైఫ్ హోటల్ కు సమీపంలో దుండగుడు దాడి చేశాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. గాయపడిన పవన్ ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.