రిజిస్ట్రేషన్ల శాఖలో ఏఐ వినియోగం.. దేశంలోనే తొలిసారి.. ఇక అవినీతికి చెక్.. తొలుత ఆ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో..

రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించి పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రిజిస్ట్రేషన్ల శాఖలో ఏఐ వినియోగం.. దేశంలోనే తొలిసారి.. ఇక అవినీతికి చెక్.. తొలుత ఆ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో..

Registration Department

Updated On : March 30, 2025 / 10:57 AM IST

Registration Department: రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక ప్రాంతాల్లో అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించి పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలను వాడుకోనుంది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ నమోదు విధానాన్ని తొలిసారిగా రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు అమలు చేయనున్నారు.

 

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు..
పైలట్ ప్రాజెక్టు కింద చంపాపేట, సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఫలితాలను బట్టి దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేయనున్నారు. అయితే, చంపాపేట, సరూర్ నగర్ కార్యాలయాల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను విలీనం చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మాన్యువల్ పద్దతిలో కాకుండా ఆన్ లైన్ లో స్లాట్ నమోదు చేసుకుంటే ఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని ఏఐ నిర్ణయిస్తుంది. ఒక్కసారి స్లాట్ నమోదైన తరువాత తిరస్కరించే అవకాశాలు లేకపోవడం వల్ల లంచాల దందా చాలా వరకు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు..

 

ఎలా పనిచేస్తుందంటే..
♦ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఆన్ లైన్ లో స్లాట్ నమోదు చేసుకోవాలి. వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.
♦ ఆటోమేటిక్ పద్దతిలో మన పరిధిలో రద్దీలేని కార్యాలయాన్ని ఎంపిక చేసి అక్కడికెళ్లి లావాదేవీని పూర్తి చేసుకోవాలని ఎస్ఎంఎస్ లో సూచిస్తుంది.
♦ ఏ లావాదేవీ కోసం ఎవరు, ఎప్పడు వస్తారనే సమాచారాన్ని ముందుగానే ఆయా ప్రాంతాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇవ్వరు. రిజిస్ట్రేషన్ కు నిర్దేశించిన తేదీన, ఆ సమయానికి ఏఐ ఆధారిత సాంకేతికతతో ఆ కార్యాలయానికి సమాచారం అందుతుంది.
♦ కనీసం 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేందుకు కొత్త పద్దతిలో సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
♦  ఏఐ వినియోగం వల్ల స్లాట్ నమోదు ప్రక్రియ చేసుకునే సమయంలోనే డాక్యుమెంట్లలో ఏవైనా లోపాలు, ఆధారాలు, లింక్ డాక్యుమెంట్లు లేకపోతే ఆ వివరాలను గుర్తించే వీలుంటుంది.